AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Phani CH
|

Updated on: May 30, 2026 | 11:30 AM

Share

అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఊహించని ప్రమాదం ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. రెస్టారెంట్‌లో భర్తతో కలిసి భోజనం చేస్తున్న సమయంలో బలమైన గాలులకు భారీ గొడుగు విరిగి ఆమెపై పడింది. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో అవుట్‌డోర్ డైనింగ్ ప్రాంతాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

దక్షిణ కరోలినాలో విషాదం జరిగింది. ఒక రెస్టారెంట్ లో ఆరుబయట టేబుల్‌ పై కూర్చొని భర్తతో కలిసి భోజనం చేస్తున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న ఆమె జీవితం క్షణాల్లో గాల్లో కలిసిపోయింది. మృత్యువు ఎపుడు? ఎలా? ముంచుకొస్తుందో తెలియదు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 46 ఏళ్ల డైనా వీంగర్ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలులు వీచాయి. గాలుల తాకిడికి టేబుల్‌ పై ఉన్న బరువైన గొడుగు విరిగి బాధితురాలిపై పడింది. అత్యవసర సహాయక బృందాలు చేరుకునే సమయానికే ఆమె ప్రాణాలు విడిచింది. ఆ గొడుగు డైనా మెడ భాగాన్ని బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. రాత్రి 7:40 నిమిషాలకు సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ రెస్పాండర్‌ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను బతికించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గొడుగు బలంగా తగలడం వల్ల ఆమె మెడలోని ప్రధాన రక్తనాళం తెగిపోవడంతోనే మరణం సంభవించినట్టు అంచనా వేశారు. ఈ ఘటనతో అవుట్‌డోర్ ఫర్నిచర్ ఎంత వరకు భద్రత అందించగలదనే అంశంపై చర్చ మొదలైంది. ఊహించని ప్రమాదంపై రెస్టారెంట్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేసింది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల జరిగిన ఈ ఘోర ప్రమాదం తమను ఎంతగానో కలచివేసిందంటూ బాధిత కుటుంబానికి సానుభూతి ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లిలో వినూత్న ‘రిటర్న్ గిఫ్ట్’.. ఊరందరికీ రూ.33.6 కోట్ల బీమా కానుక

ఈ రెండు అలవాట్లూ మార్చుకుంటే.. క్యాన్సర్ దూరం!

Aadhaar: ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు!

‘ఇండియన్స్‌ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని

Follow Us