‘ఇండియన్స్ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ తన భారతీయ మూలాలపై గర్వం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అవమానకరంగా ఉపయోగించిన ‘కూలీ’ అనే పదాన్ని ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్నామని ఆమె తెలిపారు. భారతీయ కార్మికుల కష్టం వల్లే దేశ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్న కమలా, భారతీయ సంస్కృతిని పరిరక్షించిన ప్రవాస భారతీయుల సేవలను కొనియాడారు.
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని, భారత సంతతికి చెందిన కమలా ప్రసాద్ తన పూర్వీకుల మూలాలు భారత్‌లో ఉండటం పై గర్వంగా ఉందన్నారు. భారత సంతతికి చెందిన ఆమె, తన మూలాలను గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అవమానకరంగా భావించిన పదాన్ని ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎలా మార్చుకున్నారో వివరించారు. కమల మాట్లాడుతూ, తన భారతీయ గుర్తింపు కారణంగా ఇప్పటికీ తనను అవమానించాలని చూసే వారికి తగిన విధంగా సమాధానమిచ్చారు. ట్రినిడాడ్‌లో ఈ రోజుకీ భారతీయులను ‘కూలీలు’ అని పిలుస్తారు కానీ తను ఆ విషయంలో ఏమాత్రం సిగ్గుపడటం లేదనీ ఆ ‘కూలీల’ కష్టం, రక్తం, చెమట వల్లే ఆ దేశం అభివృద్ధి చెందిందనీ కమల అన్నారు. ఈ రోజు ఒక కూలీ కూతురు ట్రినిడాడ్ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నాననీ ఆమె అన్నారు. తన భారతీయ గుర్తింపు పట్ల ఆమెకు ఎలాంటి ఆందోళన కానీ, సిగ్గు కానీ లేదనీ చెప్పుకొచ్చారు. ట్రినిడాడ్ జనాభాలో 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారని కమలా ప్రసాద్ అన్నారు. బ్రిటిష్ వారు భారతీయ కార్మికులను బానిసలుగా ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు, వారు తమతో పాటు రామాయణం, గీత, ఖురాన్‌ను కూడా తెచ్చారనీ ఆమె చెప్పారు. స్వదేశం వీడి శతాబ్దాలైనా..నేటికీ అక్కడి భారతీయులు తమ కట్టూబొట్టూ, భాష, సంస్కృతిని పరిరక్షించుకున్నారని ఆమె తెలిపారు. భారతీయుల గౌరవార్థం నెల్సన్ ఐలాండ్ పేరును మార్చనున్నట్లు కమలా ప్రసాద్ తెలిపారు. 1866 నుంచి 1917 వరకు, ఆ ద్వీపాన్ని భారతీయ కార్మికుల కోసం ఒక ల్యాండింగ్ స్టేషన్‌గా, క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించారట. భారతీయ పూర్వీకులను గౌరవిస్తూనే, ప్రజలను సంప్రదించి, కొత్త పేరును సూచించమని కోరతామని ఆమె అన్నారు. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రినిడాడ్ దేశంలో పర్యటించారు. దాంతో భారత్-ట్రినిడాడ్ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TTD: శ్రీవారి భక్తులకు భారీ ఊరట ఇక.. క్యూలైన్‌లో ఉండే పని లేదు
షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం
Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా
అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ.. అడవిలో షాకింగ్ సీన్ వైరల్
‘ఇండియన్స్ అంటే.. అక్కడ కూలీలే
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..
భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో
రావి ఆకుపై బక్రీద్ కళాఖండం..
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ

