షాక్‌లో సినీ డైరెక్టర్లు! 66 హార్డ్ డిస్క్‌లు మాయం
జోయా అక్తర్, రీమా కాగ్తీ ప్రొడక్షన్ హౌస్ టైగర్ బేబీ ఆఫీస్‌లో 66 హార్డ్ డిస్క్‌లు చోరీ కావడం సంచలనం సృష్టించింది. అన్‌రిలీజ్డ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, యాడ్ ఫుటేజ్ ఉన్న డేటా మాయం కావడంతో ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. ఈ కేసులో ఆఫీస్ బాయ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మిగిలిన హార్డ్ డిస్క్‌ల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
దర్శకులు జోయా అక్తర్, రీమా కాగ్తీకి ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని వారి ప్రొడక్షన్ కంపెనీ ‘టైగర్ బేబీ ఆఫీసులో హార్డ్ డిస్క్‌లు దొంగతనానికి గురయ్యాయి. ఈ చోరీ ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇంకా విడుదల కాని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పెద్ద బ్రాండ్‌లకు సంబంధించిన యాడ్ షూట్స్, డిజిటల్ ఫుటేజ్ ఉన్న 66 హార్డ్ డిస్క్‌లు ఆఫీస్ నుంచి మాయం కావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ఈ హార్డ్ డిస్క్‌ల మార్కెట్ విలువే 13 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఒరిజినల్ డేటా గనుక లీక్ అయితే, ఆ నష్టం వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దొంగతనం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.మొత్తం 119 హార్డ్ డిస్క్‌ల ఇన్వెంటరీ ఉండగా, అందులో 66 డిస్క్‌లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ సాదాసీదా స్టోరేజ్ డివైజ్‌లు కావు, వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 16 TB నుంచి ఏకంగా 72 TB వరకు ఉంటుంది. ఈ భారీ స్టోరేజ్ డిస్క్‌లలో షూటింగ్‌కు సంబంధించిన రా ఫుటేజ్, రఫ్ ఎడిట్స్, సీన్ కట్స్, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్ , గతంలో ఘన విజయం సాధించిన ప్రాజెక్టుల తాలూకు బ్యాకప్ డేటా భద్రపరిచారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఘోస్ట్ స్టోరీస్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఫైల్స్ ఉన్నాయి. అయితే, ఆఫీస్ క్యాబినెట్‌లో భద్రంగా ఉండాల్సిన ఆ డిస్క్‌లను మాయం చేసి, యాజమాన్యానికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు వాటి స్థానంలో ఖాళీగా ఉన్న బాక్సులని, కొన్ని పాడైపోయిన డబ్బాలని ఉంచారు. ఈ దొంగతనం ఉదంతం మే 21న బయటపడింది. ఆఫీస్ సిబ్బంది తమ రొటీన్ వర్క్ కోసం ఒక హార్డ్ డిస్క్‌ని వెతకగా అది దొరకలేదు. దాంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ కప్‌బోర్డులను నిశితంగా పరిశీలించారు. అక్కడ కొన్ని బాక్సులు పాడైపోయి, లోపల డిస్క్‌లు లేకపోవడాన్ని గమనించి ఆమె వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అంతర్గత విచారణ చేపట్టారు. గత ఏడేళ్లుగా అదే ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తూ, ఆ స్టోరేజ్ క్యాబినెట్‌ను పర్యవేక్షించే ఆఫీస్ బాయ్ అజీమ్ ఖాన్ దొంగ అని తేలింది. ఆ ఇంటిదొంగ విడతల వారీగా 24 హార్డ్ డిస్క్‌లను దొంగిలించి గ్రే మార్కెట్‌లో అమ్మేసుకున్నట్లు అంగీకరించాడు. ఒక్కో హార్డ్ డిస్క్‌ను 20 వేల రూపాయల తక్కువ ధరకే అమ్మినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు ద్వారా మే 29 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం దొంగిలించబడిన 66 డిస్క్‌లలో 24 డిస్క్‌ల వివరాలు దొరికాయి. మిగిలిన 42 హార్డ్ డిస్క్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ కేసులో అన్‌రిలీజ్డ్ సినిమా కంటెంట్‌ను నిందితులు ఎక్కడైనా కాపీ చేశారా, లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎవరికైనా విక్రయించి లీక్ చేశారా అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ యుగంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డేటా సెక్యూరిటీ ఎంత ముఖ్యమైందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ మామూలు కాదు.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటారా
అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ.. అడవిలో షాకింగ్ సీన్ వైరల్
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..
భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో
రావి ఆకుపై బక్రీద్ కళాఖండం..
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

