అంతరిక్షంలో మనిషి పుట్టుకకు తొలి అడుగు.. చైనా సంచలన ప్రయోగం వెనక అసలు కథ
అంతరిక్షంలో మానవ జీవన అవకాశాలపై చైనా కీలక ప్రయోగం చేపట్టింది. మానవ మూలకణాలతో రూపొందించిన కృత్రిమ పిండాలను తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌కు పంపి, మైక్రోగ్రావిటీలో వాటి అభివృద్ధిని పరిశీలించింది. జెబ్రాఫిష్, ఎలుకల పిండాలపై కూడా అధ్యయనం నిర్వహించారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపై మానవ నివాసాల ఏర్పాటుకు ఈ పరిశోధన కీలకంగా మారనుంది.
అంతరిక్షం ఎన్నో అద్భుతాలకు ఆలవాలంగా ఉంది. జంతువులు మొదలు మనిషి వరకు అంతరిక్షంలో వెళ్లగలిగారు. అక్కడి వాతావరణం గురించి పరిశోధనలు ఎన్నో చేస్తున్నారు. జంతువులు, మొక్కల జీవనానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి తొలిసారిగా 1961 లో అంతరిక్షంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అంతరిక్షంలో పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉన్నదా అన్న ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. శాస్త్రవేత్తలు 62 ఏళ్ల తర్వాత కూడా ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే, అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చైనా ముందడుగు వేసింది. తొలిసారిగా మానవ కృత్రిమ పిండాలను అంతరిక్షంలోకి పంపి, వాటి అభివృద్ధిపై ఒక సంచలన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మే 10న లాంగ్ మార్చ్ 7 రాకెట్ ద్వారా ప్రయోగించిన తియాన్‌జౌ-10 మిషన్, ఈ కృత్రిమ పిండాలను తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌కు విజయవంతంగా చేర్చింది. అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ లేదా మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఈ పిండాల నమూనాలు సుమారు 5 రోజుల పాటు అభివృద్ధి చెందాయి. అనంతరం విశ్లేషణ కోసం వాటిని ప్రత్యేక పద్ధతిలో భద్రపరిచారు. ఇదే సమయంలో భూమిపై కూడా కొన్ని నమూనాలను పెంచి, అంతరిక్షంలోని వాటితో పోల్చి చూస్తారు. ఈ ప్రయోగంలో భాగంగా జెబ్రాఫిష్, ఎలుకల పిండాలను కూడా పంపారు. ఇవి నిజమైన మానవ పిండాలు కావని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు స్పష్టం చేశారు. మానవ మూల కణాల నుంచి ప్రయోగశాలలో సృష్టించిన ఈ నమూనాలు, పిండం అభివృద్ధిలోని తొలి దశలను అంటే సుమారు 14-21 రోజులు మాత్రమే పోలి ఉంటాయని, ఇవి శిశువుగా మారే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అంతరిక్షంలో ఉండే తీవ్రమైన రేడియేషన్, గురుత్వాకర్షణ లేకపోవడం వంటి పరిస్థితులు మానవ పునరుత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపై మానవ కాలనీలు ఏర్పాటు చేయాలన్నా, సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాలన్నా ఈ తరహా పరిశోధనలు అత్యంత కీలకం కానున్నాయి. ఈ ప్రయోగం ఫలితాలు, అంతరిక్షంలో మానవ మనుగడకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ.. అడవిలో షాకింగ్ సీన్ వైరల్
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..
హిందూ మహాసముద్రంలో భారీ ‘గ్రావిటీ హోల్’.. వీడిన మిస్టరీ!
పొట్ట ఉబ్బిపోయి కదల్లేకుండా.. కనిపించిన కొండచిలువ
అద్భుతం.. చైనాలో డాక్టర్లు.. హైదరాబాద్‌లో సర్జరీ..
భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో
రావి ఆకుపై బక్రీద్ కళాఖండం..
సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో
ఈ కోడిపుంజు వయస్సు పదహారేళ్లు.. వైరల్ అవుతున్న టింకు కథ
సాయంత్రం 5 తర్వాతే అసలు జీవితం.. భారతీయుడి వీడియో వైరల్

