AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిండి పెట్టకుండా కొట్టి.. లైంగికంగా వేధించి..

తిండి పెట్టకుండా కొట్టి.. లైంగికంగా వేధించి..

Phani CH
|

Updated on: May 29, 2026 | 3:53 PM

Share

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చిన్నారులపై జరిగిన లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పలు ప్రీస్కూళ్లు, ప్రైమరీ స్కూళ్లు, డేకేర్ కేంద్రాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల్లో ఎక్కువ మంది 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు చర్యలు చేపట్టగా, చైల్డ్ సేఫ్టీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అత్యంత కలకలం రేపుతున్న చిన్నారుల లైంగిక వేధింపుల కుంభకోణం ఇప్పుడు ఆ దేశాన్ని వణికిస్తోంది. పాఠశాలలు, డేకేర్ సెంటర్లలో చిన్న పిల్లలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన సిబ్బంది.. చిన్నారులపై హింసకు పాల్పడటమే కాకుండా లైంగిక దాడులు, అత్యాచారాలకు ఒడిగట్టారనే ఆరోపణలపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాజధాని నగరవ్యాప్తంగా దాదాపు 84 ప్రిస్కూళ్లు, 20 ప్రైమరీ స్కూళ్లు, 10 డేకేర్ సెంటర్లలో ఈ దర్యాప్తు కొనసాగుతోందని పారిస్ ప్రాసిక్యూటర్ లోర్ బెక్యువా వెల్లడించారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పాఠశాలల్లో అభం శుభం తెలియని పసిపిల్లలపై కొందరు మానవమృగాలు జరిపిన అకృత్యాలు.. ఒక బ్రిటన్ పత్రిక ప్రచురించిన సంచలన కథనంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పారిస్ ప్రాసిక్యూటర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దాదాపు 84 ప్రీస్కూళ్లు, 20 ప్రైమరీ పాఠశాలలు, 10 డేకేర్ సెంటర్లలో గత రెండేళ్లుగా ఈ అమానుషాలు సాగుతున్నాయి. బాధితుల్లో అత్యధికులు 3 నుండి 5 ఏళ్లలోపు పసిపిల్లలే కావడం తీవ్ర కలకలం రేపుతోంది. లంచ్ బ్రేక్, నిద్రపోయే సమయాల్లో పిల్లలను చూసుకోవాల్సిన స్కూల్ మానిటర్లు, అటెండర్లే ఈ ఘోరాలకు ఒడిగట్టారు. పిల్లలను సరిగ్గా తిండి పెట్టకుండా హింసించడమే కాక, వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డారు. తమ పిల్లలు స్కూలు పేరు చెబితేనే భయంతో ఏడుస్తూ వణికిపోవడంతో తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని కుప్పకూలిపోయారు. స్కూల్ యాజమాన్యం, పోలీసులు మొదట్లో పట్టించుకోకపోయినా, తల్లిదండ్రుల సుదీర్ఘ పోరాటం, ఆందోళనల తర్వాత ఎట్టకేలకు అధికారులు విచారణ ప్రారంభించారు. ఒక స్కూల్ అటెండెంట్ ఐదుగురు చిన్నారులను వేధించినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ 78 మంది స్కూల్ మానిటర్లను తక్షణమే సస్పెండ్ చేశారు. సాధారణంగా ఫ్రాన్స్‌లో చిన్నారుల కేసులను రహస్యంగా విచారిస్తారు, కానీ బాధితుల తల్లిదండ్రుల డిమాండ్ మేరకు పారిస్ కోర్టులో ఈ కేసులపై ప్రస్తుతం “బహిరంగ విచారణ” సాగుతోంది. ఈ అమానుష ఘటన ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ సేఫ్టీపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భిక్షాటన చేస్తూ.. లక్షల విరాళమిచ్చిన రియల్ హీరో

Follow Us