ముగ్గురు అక్కాచెల్లెళ్లతో ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడంటూ వైరల్ అయిన వీడియోపై చైల్డ్ సోషల్ వెల్ఫేర్ కమిటీ విచారణ జరిపింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో, అది కేవలం పాపులారిటీ కోసం చేసిన ప్రాంక్ వీడియో అని తేలింది. ఇలాంటి వీడియోలపై కఠిన చర్యలు ఉంటాయని CWC హెచ్చరించింది. చివరికి వీడియో చేసినవారు క్షమాపణలు కోరారు.