గోదావరికి ఎర్రనీరు చేరడంతో యానాంలో ఈ ఏడాది పులస చేపల సీజన్ ప్రారంభమైంది. సుమారు కిలోన్నర బరువున్న తొలి పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఇది యానాం మార్కెట్లో వేలంలో రూ.15 వేల ధర పలికింది. దీంతో మత్స్యకారుల్లో ఆనందం నెలకొనగా, రానున్న రోజుల్లో పులస చేపల రాక మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.