భారతీయ రైల్వేలో సరుకు రవాణాకు కొత్త ఊపు లభించనుంది. వందే భారత్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన తొలి ఫ్రైట్ (సరకు) రైలు రాజస్థాన్‌లోని కోటా డివిజన్లో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసింది. తొలి రోజే గంటకు 145 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్నిఈ రైలు నమోదు చేసింది.