The Paradise: ఆలస్యం అవుతున్నా అదే కాన్ఫిడెన్స్.. నాని ఏం ప్లాన్ చేస్తున్నారు?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' విడుదల ఆలస్యమవుతున్నా, మేకర్స్ మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా నాని కెరీర్‌లోనే అతిపెద్ద చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉండగా, అత్యుత్తమ అవుట్‌పుట్ కోసం ఎలాంటి రాజీ పడకుండా పని చేస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది.
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఆల్రేడీ వన్ ఇయర్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. దీంతో అసలు అప్ కమింగ్ మూవీ విషయంలో నాని ప్లానింగ్ ఏంటి..? కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో ఇంత డిలే చేసేంత కాన్ఫిడెన్స్ ఏంటన్న ప్రచారం జరుగుతోంది. వరుసగా వంద కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న నాని, తన నెక్ట్స్ మూవీని అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా విషయంలో నాని సూపర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అందుకే గత చిత్రాలతో పోలిస్తే కాస్త ఆలస్యమైనా.. ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా అవుట్ పుట్ విషయంలో వర్క్ చేస్తున్నారు. తన ఫిల్మోగ్రఫిలో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తన కెరీర్‌ను మలుపుతిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నారు నేచురల్ స్టార్. రీసెంట్ టైమ్స్‌లో ఇమేజ్‌ను పక్కన్న నాని చేసిన ప్రయోగాలు సూపర్ హిట్ అయ్యాయి. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలో వంద కోట్ల మార్క్‌ను ఈజీగా క్రాస్ చేశాయి. అందుకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో అంతకు మించిన కాన్ఫిడెన్స్‌తో ఉన్నా… ఆలస్యం మాత్రం అందరినీ టెన్షన్ పెడుతోంది. గతంలో ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ ఇప్పుడు ఏడాది దాటిపోయినా.. ఇంకా సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేయకపోవటం ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెడుతోంది. రిలీజ్ ఆలస్యమవుతున్నా… నాని టీమ్ మాత్రం ఫుల్ కాన్పిడెంట్‌గా ఉంది. వెయిటింగ్ వర్తే అన్న సిగ్నల్స్ ఇస్తోంది. పీరియాడిక్ జానర్‌లో కొత్త వరల్డ్‌ను బిల్డ్ చేస్తూ డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి ఆ అంచనాలను ప్యారడైజ్ అందుకుంటుందా లేదా తెలియాంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!
మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

