AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ హీరోలను వెంటాడుతున్న గాయాల సమస్య

టాలీవుడ్ హీరోలను వెంటాడుతున్న గాయాల సమస్య

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 30, 2026 | 4:03 PM

Share

టాలీవుడ్‌లో వరుసగా స్టార్ హీరోలు గాయాలు, శస్త్రచికిత్సలతో వార్తల్లో నిలుస్తున్నారు. బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటుండగా, పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ చేయించుకున్నారు. చిరంజీవి, అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా గాయాల కారణంగా చికిత్స తీసుకున్నారు. షూటింగ్‌లు, యాక్షన్ సన్నివేశాల వల్లే ఎక్కువగా ఈ గాయాలు చోటుచేసుకున్నాయి.

యంగ్ హీరోలే కాదు.. సీనియర్లను కూడా గాయాలు వెంటాడుతున్నాయి. బాలయ్య ఉన్నట్లుండి హాస్పిటల్ పాలవ్వడం ఆయన అభిమానులకు షాకిస్తుంటే.. చిరంజీవి కూడా ఈ మధ్యే ఓ సర్జరీ చేయించుకున్నారు. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, అఖిల్ లాంటి హీరోలకు కూడా సర్జరీలు తప్పలేదు. అసలు వీళ్లందరికీ ఉన్న సమస్యేంటి..? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌‌ ఈ మధ్యే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో తన కుడి భుజానికి సర్జరీ చేయించుకున్నారు. 2016లో గాయం కాగా.. యాత్రల సమయంలో అభిమానులు చేతులు గట్టిగా లాగడం వల్ల కండరాల నష్టం తీవ్రమైంది. అది సర్జరీ వరకు వెళ్లింది. ఈ మధ్యే గోపీచంద్ మలినేని షూటింగ్‌లో గాయపడిన బాలయ్యకు AIGలో సర్జరీ జరిగింది. AIG సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ చౌదరి నేతృత్వంలో సుమారు 3 గంటల పాటు బాలయ్య మోకాలికి శస్త్రచికిత్స కొనసాగింది. కాకినాడ ఫోర్టులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నపుడు అనుకోకుండా కింద పడ్డారు బాలయ్య. దాంతో ఆయన కాలికి గాయమైంది. ప్రస్తుతం ఈయన విశ్రాంతి తీసుకుంటున్నారు. చిరంజీవికి సైతం గత ఫిబ్రవరిలో సర్జరీ జరిగింది. చిరంజీవి భుజానికి కీహోల్ సర్జరీ జరిగింది. అంతకుముందు అక్టోబర్ 2021లో కుడి చేతి మణికట్టు నరంపై ఒత్తిడి కారణంగా మరో సర్జరీ కూడా జరిగింది. అప్పట్లో చేతికి కట్టుతో కనిపించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందగా.. అదేంటో స్వయంగా క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్. అది జరిగిన కొన్నాళ్లకే భుజం సర్జరీ జరిగింది. అలాగే అఖిల్ అక్కినేని చేతి వేలికి కూడా ఓ మేజర్ సర్జరీ జరిగింది. ఏజెంట్ తర్వాత ఫారెన్ ట్రిప్‌లో ఉన్నపుడు సడన్‌గా కిందపడడంతో.. అఖిల్ చేతివేలికి చాలా పెద్ద గాయమైంది.. ఆ తర్వాత కోలుకోడానికి ఏడాదిన్నర పట్టిందన్నారు అయ్యగారు. యధు వంశీ సినిమా కోసం ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా షూట్‌లో గాయపడ్డారు వరుణ్ తేజ్.. ఇప్పటికీ స్టిక్‌తోనే నడుస్తున్నారీయన. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా ఆ మధ్య ఓసారి షూట్‌లో గాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

Follow Us