AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: గోవా మాఫియాలో యష్ సామ్రాజ్యం.. 'టాక్సిక్' కథపై బిగ్ రివీల్!

Toxic: గోవా మాఫియాలో యష్ సామ్రాజ్యం.. ‘టాక్సిక్’ కథపై బిగ్ రివీల్!

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 30, 2026 | 3:43 PM

Share

పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ, మూవీ కథపై ఆయనే ఆసక్తికరమైన క్లూస్ ఇచ్చారు. 1947-1961 మధ్య గోవా నేపథ్యంలో సాగే ఈ కథలో స్మగ్లింగ్, మాఫియా, అధికారం కోసం పోరాటం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. యాక్షన్‌తో పాటు ప్రేమ, కుటుంబ బంధాలు, ప్రతీకారం కలగలిసిన భావోద్వేగ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా స్టార్ యష్‌ అప్‌కమింగ్ మూవీ ‘టాక్సిక్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో, అసలు ఈ మూవీ స్టోరీలైన్ ఏంటన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ క్యూరిసిటీని మరింత పెంచే హింట్ ఇచ్చారు యష్‌. ఇంతకీ ఆయన ఇచ్చిన అప్‌డేట్స్ ఏంటి..? ఈస్టోరీలో చూద్దాం. రామాయణ, టాక్సిక్‌ ప్రమోషన్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తున్న యష్ లేటెస్ట్ ఇంటరాక్షన్‌లో టాక్సిక్ కథ రివీల్ చేశారు. ఈ సినిమా స్టోరి 1947 నుంచి 1961 మధ్యకాలంలో జరుగుతుందని రివీల్ చేశారు. పోర్చుగీస్ టైమ్‌లో గోవాలో బిజినెస్‌, పోర్టులు, స్మగ్లింగ్ రూట్స్, మాఫియా పవర్స్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పారు. వలసవాద పాలన అంతమవుతున్న సమయంలో ఓ కామన్‌ మ్యాన్‌ రక్తపాతం, భయంతో తనకంటూ ఓ సొంత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడనేదే ఈ కీ పాయింట్‌ అన్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయి. అప్పటి అండర్‌వరల్డ్ ప్రపంచాన్ని మోస్ట్‌ స్టైలిష్‌గా, రియలిస్టిక్‌గా డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరపై ఆవిష్కరించబోతున్నారు. ‘అధికారం ఎవరూ ఇవ్వరు.. లాక్కోవాలి’ అనే పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌ ఈ సినిమా సోల్‌ అంటూ ఆల్మోస్ట్ సినిమా కథ అంతా రివీల్ చేశారు యష్‌. ఈ కథలో యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలకు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయన్నారు యష్‌. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథతో పాటు, అన్నాచెల్లెళ్ల అనుబంధం, తండ్రి-కొడుకు మధ్య ప్రతీకారం చుట్టూ సాగే డీప్ ఎమోషనల్ పాయింటే ఈ సినిమా మెయిన్‌ స్ట్రెంగ్త్ అన్నారు. యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, ఫ్యామిలీ బాండింగ్, రివెంజ్ లాంటి అంశాలతో ఈ మూవీ థియేటర్లలో బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు యష్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

Follow Us