AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానం నుంచి చూస్తే 'భారత్-పాక్' సరిహద్దు ఎలా ఉందో తెలుసా?

విమానం నుంచి చూస్తే ‘భారత్-పాక్’ సరిహద్దు ఎలా ఉందో తెలుసా?

Phani CH
|

Updated on: Jun 01, 2026 | 12:01 PM

Share

రాత్రివేళ విమానం కాక్‌పిట్ నుంచి చిత్రీకరించిన భారత్-పాకిస్థాన్ సరిహద్దు దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాది ఫ్లడ్‌లైట్ల వెలుగుతో సరిహద్దు ఒక ప్రకాశవంతమైన కాంతి రేఖలా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇండిగో కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ఈ అరుదైన వీడియోను పంచుకోగా, ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సరిహద్దులలో ఒకటి ఇలా కనిపిస్తుందని పేర్కొన్నారు.

రాత్రివేళ ఆకాశం నుండి చూస్తే భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన కాంతి రేఖలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యాన్ని ఇండిగో విమాన పైలట్ ఒకరు తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకోగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ఇటీవల రాత్రి సమయంలో విమానాన్ని నడుపుతూ కాక్‌పిట్ నుండి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా సరిహద్దు వెంబడి ఏర్పాటు చేసిన వేలాది ఫ్లడ్‌లైట్ల కారణంగా.. చీకటిని చీల్చుకుంటూ ఒక నిరంతరాయమైన పసుపు కాంతి గీత స్పష్టంగా పరుచుకున్నట్లు ఇందులో కనిపిస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యం కనిపించిన వెంటనే కెప్టెన్ ప్రదీప్ విమానంలోని ప్రయాణికులకు అనౌన్స్ చేస్తూ.. “మీరు కిటికీ నుండి బయటకు చూస్తే ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన, భారీ భద్రత కలిగిన భారత్-పాక్ సరిహద్దును చూడవచ్చు” అని వివరించారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. “రాత్రిపూట అంతరిక్షం నుండి కూడా భారత్-పాక్ సరిహద్దు కనిపిస్తుందని అంటుంటారు.. ఇదే ఆ కాంతి రేఖ” అని క్యాప్షన్ జోడించారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.1.1 లక్షల కోట్లు.. ఈ డబ్బుకు వారసులెవరు?

లక్షలు ఖర్చు పెట్టే ఏసీ ఎందుకు..? కూలర్‌ అనే బెస్ట్ ఆప్షన్ ఉండగా అంటున్న నిపుణులు

తినడం రాంగ్ టైమ్ లో.. పడుకోవడం రాంగ్ టైమ్ లో.. దెబ్బతింటున్నపేగు ఆరోగ్యం

Follow Us