ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!
ఏఐ కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేశారు. చాట్‌జీపీటీ ప్రారంభమైనప్పుడు తాను ఊహించినంతగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రభావితం కాలేదని తెలిపారు. సాంకేతికంగా అంచనాలు నిజమైనా, సమాజం మరియు ఉద్యోగాలపై ప్రభావం విషయంలో తమ అంచనా తప్పిందని పేర్కొన్నారు.
ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఊరట కల్పించే మాట చెప్పారు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ . ఏఐ కారణంగా ఉద్యోగాలు భారీ స్థాయిలో పోవని అన్నారు. ఇంతకు ముందు తాను భయపడినంతగా ఈ టెక్నాలజీ వైట్-కాలర్ ఉద్యగాలను హరించలేదని తెలిపారు. 2022లో చాట్ జీపీటీని ప్రారంభించిన సమయంలో ఊహించిన టెక్నికల్ అంచనాలు నిజమయ్యాయన్నారు. కానీ, దాని వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం విషయంలో తాము తప్పుగా అంచనా వేశామని శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. ఈ విషయంలో తన అంచనా తప్పినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే చాలా వరకు ప్రారంభ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని భావించానని, కానీ వాస్తవానికి అలా జరగలేదన్నారు. గతంలో హెచ్చరికల వల్ల, మార్కెట్లో కొంత భయాందోళనలు నెలకొన్న మాట నిజమేనన్నారు. ఒక ప్రమాదం సంభవిస్తుందని అనుకున్నప్పుడు దాని గురించి ముందే మాట్లాడడం సరైనదని అప్పట్లో భావించినట్లు గుర్తు చేసుకున్నారు. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా ఉద్యోగాల్లో ఉండే మనుషుల భాగస్వామ్యం, మానవీయ కోణాన్ని ఏ టెక్నాలజీ కూడా భర్తీ చేయలేదని శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. అయితే ఎటువంటి కచ్చితమైన ఉద్యోగాల గణాంకాలను ప్రస్తావించలేదు. అమెజాన్, హెచ్ఎస్‌బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, సీబీఏ వంటి గ్లోబల్ కంపెనీలు ఇప్పటికే కొన్ని విభాగాల ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ ధోరణి కొనసాగుతుండడం ఆందోళనలు పెంచుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్!
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

