హైదరాబాద్లో ఒకే కాలేజీకి చెందిన యువతి యువకుల మధ్య గొడవల కారణంగా నిందితుడు యువతి ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి ఆమె అన్నకు పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో జవహర్నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం మేడ్చల్ పోలీసులకు కేసు బదిలీ కాగా, నిందితుడిని వేగంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.