AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Pre-Release Event LIVE: బెజవాడలో ‘పెద్ది’ మెనియా.. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌తో దుమ్ముదుమారమే.. లైవ్ వీడియో

Peddi Pre-Release Event LIVE: బెజవాడలో ‘పెద్ది’ మెనియా.. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌తో దుమ్ముదుమారమే.. లైవ్ వీడియో

Shaik Madar Saheb
|

Updated on: Jun 01, 2026 | 6:26 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూడండి..

రామ్ చరణ్, మోస్ట్ అవేటెడ్ ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ‘పెద్ది’ టీమ్ సోమవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. రామ్ చరణ్, జాన్వీకపూర్ నటించిన ‘పెద్ది’ మూవీ.. జూన్ 4న విడుదల కానుంది. అయితే.. విజయవాడలో మోత మోగిపోయేలా పెద్ది ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఉండబోతోంది.. ఇప్పటికే ట్రైలర్‌తో పెద్ది మేనియా ఇండియా మొత్తం విస్తరించింది. ఇప్పుడా జోష్‌ను మరో లెవల్ కు తీసుకెళ్లేందుకు మూవీ టీమ్ ఈ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది.

బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా కోసం.. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Published on: Jun 01, 2026 06:26 PM
Follow Us