మలయాళం హీరోయిన్లకు పెరుగుతున్న డిమాండ్.. సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కొత్త తరం బ్యూటీస్ వీళ్లే
దక్షిణాది సినీ పరిశ్రమలో మలయాళ హీరోయిన్ల హవా మరోసారి మొదలైంది. అనస్వర రాజన్, రియా శిభు, కళ్యాణి ప్రియదర్శన్, మమితా బైజు వంటి యువ నటీమణులు తమ అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌లోనూ వీరికి అవకాశాలు పెరుగుతుండటంతో మలయాళ ముద్దుగుమ్మల క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతోంది.
సౌత్ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఎంతైనా గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి వచ్చే బ్యూటీస్ కదా.. ఆ మాత్రం ట్రెండ్ అవ్వడంలో తప్పేం లేదు. ఇప్పుడూ ఇదే జరుగుతుంది. తాజాగా దక్షిణాదిన కొందరు మలయాళీ బ్యూటీస్ తెగ ట్రైండ్ అవుతున్నారు. మరి ఆ మాయేంటో మనమూ చూద్దామా..? ఈ పాట వచ్చినప్పటి నుంచే అనస్వర రాజన్ గురించి తెలుగులోనూ చర్చ మొదలైంది. ఎవరీ అమ్మాయి.. ఇంత క్యూట్‌గా ఉందంటూ దర్శకుల వేట షురూ అయింది. తాజాగా అనస్వర తెలుగులో బిజీ అయిపోయారు. మెగా 158లో చిరంజీవి కూతురుగా నటిస్తూనే.. మరోవైపు ఇట్లు అర్జున సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ మలయాళ కుట్టి. రియా శిభు సైతం ఇన్‌స్టా, ట్విట్టర్ తేడా లేకుండా ట్రెండ్ అవుతున్నారు. దానికి కారణం సర్వం మాయ సినిమా. ఓటిటిలో వచ్చినప్పటి నుంచి ఈ బ్యూటీ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందర్నీ మాయలో పడేసారు రియా. తెలుగులోనూ ఈమె పేరు గట్టిగానే వినిపిస్తుందిప్పుడు. వీలైనంత త్వరలోనే రియా టాలీవుడ్ ఎంట్రీ ఊహించొచ్చు. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నాళ్లకు కళ్యాణి ప్రియదర్శన్ ‘కొత్తలోక’ సినిమాతో ట్రెండ్ అవుతున్నారు. పైగా సీక్వెల్ కూడా ఉంది. ఇక ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ లిస్టులో టాప్‌లో ఉన్నారు. జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో ట్రెండ్ అవుతున్నారు మమితా. ఈ మధ్యే కర సినిమాలో నటించారు ఈ బ్యూటీ. మొత్తానికి చూస్తుంటే మళ్లీ మలయాళ ముద్దుగుమ్మల టైమ్ మొదలైనట్లే కనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!
అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’
బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
అంతరిక్షంలో 'రమ్'వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్!
విమానం నుంచి చూస్తే 'భారత్-పాక్' సరిహద్దు ఎలా ఉందో తెలుసా?
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం

