Kajal Aggarwal: గ్లామర్ డోస్ పెంచేసిన చందమామ.. కాజల్ అసలు ప్లాన్ ఇదేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన కాజల్ అగర్వాల్, పెళ్లి తర్వాత సినిమాల్లో కాస్త నెమ్మదించినా ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న గ్లామరస్ ఫోటోషూట్లు వైరల్ అవుతున్నాయి. బరువు తగ్గి కొత్త లుక్‌తో కనిపిస్తున్న కాజల్, సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారనే చర్చ మొదలైంది. అయితే కొత్త తరం హీరోయిన్ల పోటీలో ఆమె ఎలా నిలబడతారనేది ఆసక్తికరంగా మారింది.
కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నారా..? ఒకప్పుడు మకుటం లేని మహారాణిలా టాలీవుడ్‌ని ఏలిన మిత్రవింద.. కొన్నేళ్లుగా సీన్‌లోనే కనిపించడం లేదు. పెళ్ళి తర్వాత క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో కాజల్ కెరీర్ మళ్లీ పుంజుకోవడం సాధ్యమేనా.. ఉన్నట్లుండి గ్లామర్ డోస్ పెంచడం వెనక కారణం అదేనా..? కాజల్ అగర్వాల్.. ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. దశాబ్ధం కింద టాలీవుడ్‌లో స్టార్ హీరోలందర్నీ చుట్టేసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. కొత్తవాళ్లు రావడంతో రేస్ నుంచి బయటికొచ్చేసారు కాజల్. పెళ్లి తర్వాత కెరీర్ మరింత స్లో అయిపోయింది. ఖైదీ నెం 150 చివరగా తెలుగులో కాజల్‌కు హీరోయిన్‌గా వచ్చిన హిట్. భగవంత్ కేసరి హిట్టైనా.. పేరంతా శ్రీలీలకు వెళ్ళిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ అవకాశాల వేటలో బాగా వెనకబడిపోయారు కాజల్. సీనియర్ కూడా అవ్వడంతో.. ఈ జనరేషన్ హీరోలతో జోడీ సెట్ అవ్వట్లేదు. దాంతో లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులేసారీమే. కానీ ఉన్నట్లుండి గత వారం రోజులుగా గ్లామర్ డోస్ పెంచేసారు చందమామ. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. కాజల్ కొత్త ఫోటోషూట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. గతంతో పోలిస్తే బాగా బరువు కూడా తగ్గిపోయారు కాజల్. ఒకప్పటి చందమామను గుర్తుకు తెచ్చేలా గ్లామర్ షో చేస్తున్నారు. ఈ సడన్ మేకోవర్ సెకండ్ ఇన్నింగ్స్ కోసమే అని అర్థమవుతుంది. కానీ ఈమెకు ఇప్పుడు అవకాశాలు ఇచ్చే హీరోలున్నారా.. ఒకప్పట్లా చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో మళ్లీ జోడీ కట్టగలరా..? కొత్తవాళ్లను తట్టుకుని నిలబడటం అంత చిన్న విషయమేం కాదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!
అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’
బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి
ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
అంతరిక్షంలో 'రమ్'వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
ఏఐ మాయ.. ఇక పెంపుడు జంతువులూ మాట్లాడతాయ్!
విమానం నుంచి చూస్తే 'భారత్-పాక్' సరిహద్దు ఎలా ఉందో తెలుసా?
దుర్గమ్మ భక్తులకు అలర్ట్..ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత!
వడదెబ్బ ధాటికి ఒక్కరోజే 23 మంది బలి..ఏపీలో పిడుగులతో కూడిన వర్షం

