AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఆకులను అస్సలు పారేయకండి! అందులోని పోషకాలు, అద్భుత ప్రయోజనాలు తెలిస్తే..

చాలా మంది ముల్లంగి దుంపలను ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, దానికి పైన ఉండే ఆకులను మాత్రం పనికిరానివిగా భావించి డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. అయితే, మీరు కూడా అదే తప్పు చేస్తున్నట్లయితే ఇప్పుడే ఆ అలవాటును మార్చుకోండి. ఎందుకంటే, ముల్లంగి దుంప కంటే దాని ఆకులలోనే రెట్టింపు పోషక విలువలు దాగున్నాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. ముల్లంగి ఆకుల అద్భుత ప్రయోజనాలు, సులభమైన వంటకాలు మీకోసం!

Jyothi Gadda
|

Updated on: Jun 02, 2026 | 12:03 PM

Share
ముల్లంగి ఆకుల్లోని పోషకాల గని: ముల్లంగి ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ (పీచు పదార్థం) జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది.

1 / 6
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముల్లంగి ఆకుల్లో ఉండే విటమిన్ సి శరీరంలో ఇమ్యూనిటీని స్ట్రాంగ్‌గా మార్చి సీజనల్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

2 / 6
రక్తహీనతకు చెక్: ఈ ఆకులలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. రక్తహీనత (ఎనిమియా) సమస్యతో బాధపడేవారికి ఇది ఒక ఉత్తమమైన సహజ ఆహారం.

3 / 6
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఇందులో ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి పొట్ట సమస్యలను తగ్గించి జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది.  ముల్లంగి ఆకులలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోని వ్యర్థాలను (Toxins) బయటకు పంపి, బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది.

4 / 6
ఎలా తీసుకోవాలి?: ముల్లంగి ఆకులను బాగా కడిగి, సన్నగా తరిగి తోటకూర, పాలకూర వండుకున్నట్లే పప్పులో వేసి వండుకోవచ్చు. లేదా ముల్లంగి ముక్కలతో కలిపి ఫ్రై (పొరటు) లాగా కూడా చేసుకోవచ్చు. దీనిని పరాటాలలో స్టఫింగ్‌గా కూడా వాడుకోవచ్చు.

5 / 6
ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతి ఆకులోనూ ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. కేవలం అవగాహన లేకపోవడం వల్ల ముల్లంగి ఆకులను పారేసి, అందమైన ఆరోగ్యాన్ని దూరం చేసుకోకండి. మీకు ఎప్పుడు అందుబాటులో లభించినా కూడా మీ ఆహారంలో ముల్లంగి ఆకులను చేర్చుకుని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

6 / 6
Follow Us
పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి

బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని

నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు.. స్టార్ హీరోలే క్యూ కట్టిన బ్యూటీ..

మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే

చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో

వైట్ బాల్‌లో హీరో.. రెడ్ బాల్‌లో జీరో.. పరువు తీస్తున్నావ్‌గా

వర్షం కురిసింది.. పంట మురిసింది..
వర్షం కురిసింది.. పంట మురిసింది..
పొరలు పొరలుగా గుడ్డు పరాఠా.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది

గోరింటాకు ఎర్రగా 10 నిమిషాల్లో పండాలంటే ఇది ఒక్కటి కలపండి చాలు

'టాక్సిక్'లో నయనతార రోల్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?