25 March 2026

ఇకపై ప్రభుత్వ ఉద్యోగిగా రింకూ సింగ్.. శాలరీ ఎంతో తెలుసా?

Venkata Chari

భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రింకూ సింగ్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ఈ శుభవార్త వెలువడింది. 

ప్రభుత్వ ఉద్యోగం

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రింకూ సింగ్‌ను ప్రాంతీయ క్రీడా అధికారిగా నియమించారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు గానూ ఈ గౌరవం దక్కింది.

ప్రపంచకప్ ఛాంపియన్ తో

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ప్రాంతీయ క్రీడా అధికారి పదవి అనేది గెజిటెడ్ హోదా కలిగిన ఉద్యోగం. నివేదికల ప్రకారం, రింకూ సింగ్ నెలవారీ వేతనం సుమారు 80,000 నుండి 90,000 రూపాయల వరకు ఉండనుంది. 

శాలరీ ఎంతంటే?

ప్రాథమిక వేతనంతో పాటు కరువు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA, ప్రయాణ ఖర్చులు కూడా అదనంగా లభిస్తాయి. దీనితో పాటు ప్రభుత్వ నివాసం లేదా బంగ్లా పొందే అవకాశం కూడా ఉంది.

అదనంగా..

కేవలం 9వ తరగతి వరకే చదివినప్పటికీ, క్రీడల్లో అతను సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.

9వ తరగతి వరకే చదివినా..

అలీఘడ్‌కు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రింకూ, తండ్రి సిలిండర్లు డెలివరీ చేసే పని చేసేవారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలోనే ఆపేశాడు. 

ఆర్థిక ఇబ్బందులతో..

క్రికెట్ పట్ల ఉన్న మక్కువతో రింకూ సింగ్ నేడు ఈ స్థాయికి చేరుకున్నాడు. దేశం తరపున ఆడుతూనే ఇప్పుడు తన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేసే అవకాశం పొందడం విశేషం. 

క్రీడల అభివృద్ధికి

కేవలం రింకూ సింగ్‌కే కాకుండా, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన హాకీ ఆటగాడు రాజ్‌కుమార్ పాల్‌ను డీఎస్పీగా, పారాలింపిక్ విజేత ప్రవీణ్ కుమార్‌ను కూడా ఉన్నత పదవిలో నియమించారు. 

దటీజ్ రింకూ సింగ్