ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో ఓ అరుదైన సంఘటన వెలుగు చూసింది. ఇంటి యజమానులు వేసవి సెలవులకు ఊరెళ్లగా, ఖాళీగా ఉన్న స్కూటీ ముంగిట భాగంలోని బాక్సులో ఓ పిచ్చుక గూడు కట్టి, గుడ్లు పెట్టింది. సురక్షితమైన ప్రదేశం దొరకకనే పిచ్చుక ఇలా చేసిందని భావిస్తున్నారు. గుడ్లు పొదగడం పూర్తయ్యే వరకు బండిని కదపవద్దని స్థానికులు కోరుతున్నారు.