ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా చామవరంలో పర్యటించారు. పేదల సేవలు కార్యక్రమంలో భాగంగా తాటికల్లు కార్మికుడు పోలరపు సింహాచలాన్ని కలిసి, ఎన్టీఆర్ భరోసా పించను అందజేశారు. వారి వృత్తి కష్టాలు, జీవన విధానం తెలుసుకుని, స్వయంగా తాటికల్లు రుచి చూశారు. సింహాచలం కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.