AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ది టికెట్ రేట్లు పెరగవా..? తెలంగాణలో కొత్త రూల్ మొదలైందా

పెద్ది టికెట్ రేట్లు పెరగవా..? తెలంగాణలో కొత్త రూల్ మొదలైందా

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 1:37 PM

Share

తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపుపై అనిశ్చితి నెలకొంది. పెద్ది చిత్ర నిర్మాతలు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ సినిమా సాధారణ టికెట్ రేట్లతోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో టికెట్ హైక్స్‌పై వచ్చిన వివాదాలు, కోర్టు పరిణామాల నేపథ్యంలో ఇకపై పెద్ద చిత్రాలకు ధరల పెంపు అనుమతులు లభిస్తాయా అనే చర్చ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

తెలంగాణలో ఇకపై పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెరగవా..? హైక్స్ విషయంలో నిర్మాతలే ఓ నిర్ణయానికి వస్తున్నారా..? పెద్ది సినిమాకు కూడా రేట్లు ఇక పెరగనట్టేనా..? సంక్రాంతి టైమ్‌లో జరిగిన కోర్టు ఇష్యూస్ కారణంగా ఇకపై రేట్ల పెంపు ఉండదా..? అసలేం జరుగుతుంది నైజాం మార్కెట్‌లో.. రేట్లు పెరగవు అని ఇచ్చిన మాటపై ఎగ్జిబిటర్లు నిలబడుతున్నారా..? తెలంగాణాలో పెద్ది టెక్కెట్ రేట్ల పెంపుపై సందిగ్ధత కొనసాగుతుంది. హై కోర్టులో టికెట్ ధర పెంపునకు పిటిషన్ వేసి మళ్ళీ విత్ డ్రా చేసుకున్నారు పెద్ది నిర్మాతలు. పరిస్థితులు చూస్తుంటే హైక్స్ లేకుండానే రిలీజ్ అయ్యేలా కనిపిస్తుంది పెద్ది సినిమా. ప్రస్తుతానికి సింగిల్ స్క్రీన్స్‌లో 175 రూపాయలు.. మల్టీప్లెక్స్‌లలో 295 రూపాయలుగా రేట్ ఉంది. జూన్ 4న పెద్ది సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు టికెట్ ధర పెంపునకు అనుమతి ఇవ్వాలని పిటీషన్ వేసింది పెద్ది నిర్మాణ సంస్థ. హోం సెక్రెటరీకి రెండు సార్లు వినతి పత్రం ఇచ్చినట్టు కోర్ట్‌కు తెలిపారు సినిమా నిర్మాత. అయినా సరే సానుకూలత లేకపోవడంతో హై కోర్టులో పిటిషన్ వేశారు. కానీ అక్కడ్నుంచి స్పందన లేదు. టికెట్ రేట్ల వ్యవహారంపై గత తీర్పులను దృష్టిలో ఉంచుకున్న హై కోర్టు.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో పిటిషన్‌ ఉపసంహరించుకుంది పెద్ది చిత్ర నిర్మాణ సంస్ద. చివరగా రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలకు రేట్లు పెంచేందుకు అనుమతినిచ్చింది తెలంగాణ సర్కార్. అందులో రాజా సాబ్ ప్రీమియర్లకు రేట్లు పెరగలేదు. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్‌కు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచుకోవచ్చన్నారు. తర్వాత దీనిపై కోర్టులో ఇష్యూస్ అయ్యాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ హైక్స్ లేకుండానే రిలీజైంది. తాజాగా పెద్ది ప్రీమియర్స్ వేసినా కూడా.. 295 రూపాయలతో రావాల్సిందే. ఇండస్ట్రీ అంతా వెళ్లి ప్రభుత్వాన్ని కలిస్తే సీఎం ఏదైనా ఆలోచిస్తారేమో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిడ్డను కనండి.. రూ.64 లక్షలు అందుకోండి

ఇంటిపై భారీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

ఉద్యోగాలన్నీ ఏఐ తీసేస్తుందా..? మనుషులను టెక్నాలజీ భర్తీ చేయలేదు!

అంతరిక్షంలో ‘రమ్’వాసన.. వింత మేఘాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఫిట్‌నెస్ ట్రెండ్..బరువు తగ్గడానికి ‘6-6-6 వాకింగ్ టెక్నిక్’

Follow Us