AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. క్లైమాక్ చూస్తే మైండ్ కరాబ్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

దాదాపు 2 గంటల34 నిమిషాల సినిమా.. ప్రతిక్షణం ఊహించని మలుపులు.. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఇక క్లైమాక్స్ చూసి అడియన్స్ మైండ్ బ్లాంక్ అవుతుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. క్లైమాక్ చూస్తే మైండ్ కరాబ్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
Deva Movie
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2025 | 7:18 AM

Share

మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సస్పెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఓ సినిమా గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ చిత్రంలోని క్లైమాక్స్ మిమ్మల్ని షాక్ కు గురిచేస్తుంది. ఈ సినిమాలో హీరోగా భావించే వ్యక్తి నిజమైన విలన్‌గా మారతాడు. మనం మాట్లాడుతున్న సినిమా మరెవరో కాదు ‘దేవా’. 2025 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం ఒక మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఇందులో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు, అలాగే పూజా హెగ్డే కథానాయికగా కనిపించింది. ఆయనతో పాటు, పావైల్ గులాటి, కుబ్రా సైట్, ప్రవేశ్ రాణా వంటి తారలు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్ దేవ్ పాత్రను పోషించారు.

ఇక ఈ సినిమా కథ మొత్తం దేవ్ చుట్టూ తిరుగుతుంది. అతను ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. పని విషయంలో అతను ఎవరి మాట వినడు. అతిపెద్ద గూండాలు, నేరస్థులు కూడా దేవ్ కి భయపడతారు. ఈ చిత్రంలో పావైల్ గులాటి ACP రోహన్ డి’సిల్వా పాత్రను పోషించారు. అయితే దేవా, రోహన్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. పోలీసుల కోసం నిర్వహించిన ఓ వేడుకలో రోహన్ హత్యకు గురవుతాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. రోహన్ హత్య కేసును దర్యాప్తు ప్రారంభించి, హంతకుడిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు దేవా. అప్పుడే ఓ ప్రమాదంలో చిక్కుకుని జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సినిమా కథ మొత్తం తలక్రిందులవుతుంది.

సినిమా చివరి వరకు విలన్ ఎవరనేది అర్థం కాదు. కానీ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఈ చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో జనాలను మెప్పించారు షాహిద్ కపూర్. ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. రూ. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 56.12 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ప్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా