12 June 2025

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.

రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న త్రిష.. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకే గట్టి పోటీనిస్తుంది.

41 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిగా కనిపిస్తున్న త్రిష.. తాజాగా తన అందానికి రహస్యం చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏం చేస్తుందో తెలుసా.. ?

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన మొదటి నుంచి అందంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంది త్రిష. మిస్ చెన్నై పోటీలో పాల్గొని విన్ అయ్యింది. 

కెరీర్ తొలినాళ్లల్లో పలు ప్రకటనలలో కలిసి నటించింది. తెలుగు, తమిళం భాషలలో త్రిష నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. 

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అందంతో కుర్ర హీరోయిన్లకే గుబులు పుట్టిస్తోన్న త్రిష.. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీ సీక్రెట్స్ వైరలవుతున్నాయి. 

తన అందానికి కారణం డైట్, వర్కవుట్స్ అని.. అలాగే నాన్ వెజ్ విషయంలో ఎక్కువగానే కట్టుబాట్లు పెట్టుకుని ఫాలో అవుతుందట ఈ అమ్మడు. 

అలాగే ఆయిల్ ఫుడ్ కాకుండా కాయగూరలతో చేసిన ఆహారం.. ఇంట్లో వండిన పదార్థాలనే తీసుకుంటుందట. యోగ, జిమ్ చేస్తుందట.