బుల్లితెరపై ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రతో రఫ్పాడిస్తుంది. చీరకట్టులో గ్లామర్ లుక్ గా కనిపిస్తూనే ఇటు సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తుంది.
సీరియల్స్‌లో విలన్‌గా కనిపిస్తున్న ఈ వయ్యారి.. ఇప్పుడు వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. నెట్టింట షేర్ చేసిన గ్లామర్ పిక్స్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆమె మరెవరో కాదండి.. బుల్లితెరపై రుద్రాణి అత్త.. అలియాస్ షర్మిత గౌడ. బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
కన్నడలో అనేక సీరియల్స్ చేసిన ఆమె ఇప్పుడు తెలుగులో బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రలో అదరగొట్టేస్తుంది. ఆమెకు సెపర్టే ఫాలోయింగ్ ఉంది.
అందం, అభియంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపిస్తున్నప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రుద్రాణి.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. తన స్నేహితులతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు పిక్స్ చూస్తే తెలుస్తోంది.
షర్మిత వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. కానీ సీరియల్స్ లో మాత్రం తనకంటే పెద్ద నటీనటులకు తల్లిగా, అత్తగా కనిపిస్తూ నటనతో రఫ్పాడిస్తుంది.
చిన్న వయసులోనే అత్త పాత్రలతో ఫేమస్ అయిన షర్మిత.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాల ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.