Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమా కలర్ ఫోటో. డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బలమైన కంటెంట్, సహజమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. అంతేకాకుండా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డ్ అందుకుంది.

కలర్ ఫోటో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన చిన్న సినిమాల్లో ఇది ఒకటి. యంగ్ హీరో సుహాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2020లో నేరుగా ఓటీటీలో విడుదలై విపరీతమైన వ్యూస్ సంపాదించుకుంది. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, బెన్ని ముప్పానేని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాతో సుహాస్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాగా.. యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరీ కథానాయికగా కనిపించింది. ఇందులో వీరిద్దరి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే సునీల్, వైవా హర్ష యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు.
1990లలో మచిలిపట్నం నేపథ్యంలో ఓ సాధారణ యువకుడి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈసినిమాను ఓ హీరోయిన్ చేతులారా మిస్ చేసుకుందట.. ఈ హిట్ మూవీని మిస్ అయినందుకు ఆ హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా… ? తనే అచ్చ తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని. ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే. కానీ హుషారు మూవీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు.
2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు సినిమాల్లో నటించింది. అయితే హుషారు సినిమాతో ఈ బ్యూటీకి గుర్తింపు వచ్చింది. ఈ మూవీతోనే ఈ అమ్మడి క్రేజ్ మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తనకు కెరీర్ తొలినాళ్లల్లోనే కలర్ ఫోటో సినిమా ఛాన్స్ వచ్చిందని.. కానీ అప్పట్లో సరిగ్గా గైడ్ చేసేవారు లేకపోవడంతో ఆ సినిమా చేయాలేకపోయినట్లు తెలిపింది. పల్లెటూరి అమ్మాయి పాత్రకు నేను సెట్ కాను అని తన ఫ్యామిలీ భావించిందని అందుకే ఆ మూవీని మిస్ అయినట్లు తెలిపింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




