Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే విమానం కుప్పకూలి మంటల్లో దగ్దమైంది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితోపాటు వైద్య కళాశాల హాస్టల్ లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గతంలో విమాన ప్రమాదాల్లో సెలబ్రెటీస్ సైతం మరణించిన విషయం మీకు తెలుసా.. ?

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వందల కుటుంబాల్లో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే చెట్టును ఢీకొని విమానం కుప్పకూలి మంటల్లో దగ్దమైంది. ఈ ప్రమాదానికి కారణమేంటనే దానిపై సరైన స్పష్టత రాలేదు. ఈ ఘటనలో దాదాపు 269 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి మృతదేహాలకు అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. కానీ మీకు తెలుసా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో నిజ జీవితంలో విమాన ప్రమాదానికి గురయ్యారు. ఆ ఘటనలో తన భుజం విరిగినప్పటికీ ఇతరులను ధైర్యంగా కాపాడారు. 2001లో జరిగిన ఈ ఘటనలో బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ ఎంపీ తృటిలో తప్పించుకున్నారు. నాసిక్‌లో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ముంబైకి తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
బహదూర్ గ్రామం సమీపంలో ఆ విమానం కూలిపోయింది. అహ్మదాబాద్ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన “పైపర్ అపాచీ” 6 సీట్లు, 2 ఇంజిన్లు కలిగిన చిన్న విమానం అది. రాత్రి సమయంలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సోహైల్ నందా ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు గమనించాడు. అతడు వెంటనే ముంబై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చాడు అప్పుడు రాత్రి 11.10 గంటలు. వెంటనే విమానం బహదూర్ గ్రామ సమీపంలోని పొలంలో కూలిపోయింది. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. కానీ ఆ గ్రామస్తులు ధైర్యంగా తలుపులు పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారందరినీ వెంటనే నాసిక్‌లోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అదే విమానంలో ప్రయాణిస్తున్న హీరో భుజానికి గాయమైనప్పటికీ తన తోటి నటులను బయటకు పంపించి వారందరినీ రక్షించారు. భుజానికి, కాలికి తీవ్రంగా గాయమైనప్పటికీ ఇతరులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి.. చివరకు అతడు కూడా విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆ హీరో మరోవరో కాదు.. దివంగత సీనియర్ నటుడు సునీల్ దత్. 70 ఏళ్ల సునీల్ దత్ భుజం, కాలుకు ఫ్రాక్చర్లతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సునీల్ దత్ ప్రాణాలతో బయటపడ్డారు.

Sunil Dutt. News
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




