Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..

చిన్న వయసులోనే సినీరంగంలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం ఈ హీరో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు. కానీ 30 ఏళ్లకే సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పుడు అదరగొట్టేస్తున్నారు.

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..
Arvind Swamy
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2025 | 8:43 AM

Share

చిన్న వయసులోనే సినిమాల్లో సూపర్ స్టార్ హోదా సంపాదించుకున్నారు. 90’sలో అమ్మాయిల కలల రాకుమారుడు. ప్రేమకథలు, మాస్ యాక్షన్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. నిజానికి తమిళంలో టాప్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అప్పట్లో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెద్ద ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలుకు పక్షవాతం వచ్చింది. దీంతో ఆయన కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యారు. కానీ తన తండ్రి ప్రారంభించిన వ్యాపారాలను చూసుకుంటూ దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారు. చాలా సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమైన ఈ హీరో.. ఆ తర్వాత విలన్ పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ఆయనే అరవింద్ స్వామి.

ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలకు ఇష్టమైన హీరో. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే లవర్ బాయ్. 1991లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దళపతి చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో రజినీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఆ సమయంలో ఒక కొత్త కుర్రాడు రజినీకాంత్ వంటి స్టార్ హీరోకు వ్యతిరేకంగా బలమైన పాత్ర పోషించడం జనాలకు ఆశ్చర్యకలిగించింది. తన మొదటి చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఏడాది డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రోజా చిత్రంతో హీరోగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

ఆ తర్వాత ముంబాయి, మిన్ సార కనవు, ఇందిర వంటి చిత్రాల్లో నటించింది. సాత్ రంగ్ కే సప్నే చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2000 సంవత్సరంలో మణిరత్నం నిర్మించిన ‘అలైపాయుడే’ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. ఆ తర్వాత 13 ఏళ్ల పాటు నటించలేదు. 30 ఏళ్ల వయసులోనే సినిమాల నుంచి రిటైర్ అయ్యారు. 2005లో జరిగిన ఒక ప్రమాదంలో అరవింద్ స్వామి కాలికి తీవ్ర గాయమైంది. కొన్ని సంవత్సరాలు అతడు నడవలేకపోయారు. దాదాపు 5 ఏళ్లపాటు నిరంతరంగా చికిత్స తీసుకున్నాడు.

అదే సమయంలో టాలెంట్ మాగ్జిమమ్ అనే కంపెనీ స్టార్ట్ చేసి వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు. ఈ కంపెనీ విలువ ఇప్పుడు రూ.3,300 కోట్లు ఉంటుందని సమాచారం. 2013లో మణిరత్నం దర్శకత్వం వహించిన కడలి సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. ఇటీవలే కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన సత్యం సుందరం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..