Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
భారతీయ సినీప్రపంచంలో అతడు తోపు నటుడు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎన్నో వందల చిత్రాల్లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో హీరోగా కనిపించిన ఆయన.. ఆ తర్వాత వయసుకు తగిన పాత్రలు పోషిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. కోట్లు , లగ్జరీ లైఫ్ వదిలి ఒక చిన్న పల్లెటూరిలో ప్రశాంతమైన వాతావరణం మధ్య జీవిస్తున్నారు.

సినీరంగుల ప్రపంచంలో అతడు తోపు నటుడు. దశాబ్దాల సినీప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇప్పుడు లగ్జరీ లైఫ్ వదిలి పల్లెటూరిలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇందుకు గల కారణాన్ని ఇటీవల అమితాబ్ బచ్చన్ తో జరిగిన ఒక షోలో పంచుకున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ సీనియర్ స్టార్ నానా పటేకర్. హిందీ భాషలో అనేక చిత్రాల్లో నటించిన ఆయన.. ఇప్పుడు మహా నగరానికి దూరంగా మహారాష్ట్రలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు. అతనికి ముంబైలో ఇల్లు ఉన్నప్పటికీ, షూటింగ్ సమయంలో మాత్రమే అతను అక్కడ ఉంటారు.
ముంబై వదిలి చిన్న గ్రామంలో ఉండేందుకు తనకు ప్రత్యేకమైన కారణం ఉందని అన్నారు. ఆ చిన్న గ్రామంలో తనకు ప్రకృతి మాత్రమే కాకుండా మనుషులను, జంతువుల మధ్య జీవిస్తామని అన్నారు. తనకు పది ఆవులు, ఎద్దులు, ఆరు కుక్కలు ఉన్నాయని.. అంతకు మించిన పచ్చదనం తన చుట్టూ ఉంటుందని అన్నారు. కొత్త కారు కొనాలని.. ఇళ్లు కొనాలనే ఆలోచనలు తనకు లేవని.. ఇటీవల తన ఇంటి వద్ద గొట్టపు బావి తవ్వినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగిందని అన్నారు. ఆ గ్రామంలోని మనుషులతో తాను ఎప్పుడూ మాట్లాడుతుంటానని.. అక్కడున్నవారి ప్రవర్తన చిన్నపిల్లల్ల ఉంటుందని అన్నారు.
సింపుల్ లైఫ్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఖరీదైన బట్టులు, ఖరీదైన వస్తువులు తనకు ఎలాంటి సంతోషాన్ని కలిగించవని అన్నారు. తనకు దేవుడు అందమైన జీవితాన్ని అందించాడని చెప్పుకొచ్చాడు. ఇదే కాదు.. గతంలోనూ నానా పటేకర్ తనకు నచ్చిన పని చేశారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలు వదిలి కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశారు.

Nana Patekar Life
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




