AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

ఒకప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటించింది. అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..
Sadaa
Rajitha Chanti
|

Updated on: May 21, 2025 | 4:11 PM

Share

దక్షిణాది సినీరంగంలో ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. దాదాపు నాలుగు పదుల వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పట్లో వరుస సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ప్రస్తుతం అడవులలో ఉండే జంతువుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తనకు నచ్చిన రంగంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం వైల్డ్ లైఫ్ ఫోటోస్ షేర్ చేస్తుంది. ఆమె మరెవరో కాదండి.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన అమ్మడు హీరోయిన్ సదా.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ సదా. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 2003లో నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. జయం సినిమా తర్వాత తెలుగు, తమిళం వరుస విజయాలు అందుకుంది. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఈ అమ్మడు. జయం సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన సదా.. ఆ తర్వాత విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

కానీ సదా నటించిన చిత్రాలు ఆ తర్వాత నెమ్మదిగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఆతర్వాత బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. అదే సమయంలో తనకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, పక్షుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేస్తుంది.

View this post on Instagram

A post shared by Sadha Sayed (@sadaa17)

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..