OTT సంస్థతో ఒప్పదం.. కట్ చేస్తే నోరెళ్లబెడుతున్న హీరో ఫ్యాన్స్
గతేడాది స్వాగ్ తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు మరోసారి కామెడీ ఎంటర్ టైనర్ సింగిల్‌తో రీసెంట్‌గా మన ముందుకు వచ్చాడు. కేతికా శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. రిలీజ్ కు ముందే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే నిర్వహించారు.
దీంతో రిలీజ్ కు ముందే సింగిల్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే మే 09న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో శ్రీవిష్ణు, కేతిక, ఇవానా మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. మొత్తానికి సింగిల్ తో మరో సూపర్ హిట్ మూవీని ఖాతాలో వేసుకున్నాడు శ్రీ విష్ణు. ఇప్పటికే ఈ సినిమా రూ. 25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో థియేటర్లలో ప్రదర్శితమవుతోన్న సింగిల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఓటాక్ బయటికి వచ్చింది. సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో థియేటర్లలో రిలీజైన నాలుగు వారాలకు ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అంటే జూన్ 6వ తేదీన లేదా జూన్ 12న సింగిల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందన్నమాట. అయితే ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అప్పుడే ఓటీటీలోకా అనే షాకింగ్ రియాక్షన్ శ్రీవిష్ణు ఫ్యాన్స్ నుంచి వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం.. ముక్కు, చేతులకు తీవ్ర గాయాలు..
హీరోగా నా ఎదుగుదలను చూడకుండానే.. వెళ్లిపోయావా అమ్మా..
తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
