Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు

తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు

Phani CH

|

Updated on: May 21, 2025 | 3:41 PM

చెరుకుతో చేసే బెల్లమే కాదు, తాటి బెల్లం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పోషక విలువలు పుష్కలంగా ఉండే తాటి బెల్లాన్ని చెక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆడవారిలో ఎదురయ్యే నెలసరి సమస్యలతో సహా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఎన్నో కలిగిస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెక్కెరతో పోలిస్తే తాటి బెల్లంలో ఖనిజ లవణాలు 60 శాతం ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తాటి బెల్లము తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజైములను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. టీ, కాఫీ, పండ్ల రసాలలో తాటి బెల్లాన్ని వినియోగించవచ్చని సూచిస్తున్నారు. తాటి బెల్లం తరుచు తినడం వల్ల ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పొట్టును శుభ్రపరుస్తుంది. అలాగే పేగులు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీర ఆహారాన్ని బాగా గ్రహించడానికి తాటి బెల్లం సహాయపడుతుంది. గట్లోని మంచి బ్యాక్టీరియాను కాపాడేందుకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పితో బాధపడుతున్న వారు, మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్న వారు రోజు చిన్న తాటి బెల్లం ముక్కను తింటే ఆ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే పీరియడ్ నొప్పులకు తాటి బెల్లం చాలా బాగా పనిచేస్తుందట. పొట్టి కడుపు నొప్పి, తిమ్మిర్లు వంటివి రాకుండా రక్షిస్తుంది. ఇది శరీరంలో ఎండార్ఫిన్ లను విడుదల చేస్తుంది. మూడ్ స్వింగ్స్ రాకుండా కూడా బయటపడేస్తుంది. అంతేకాదు బరువు తగ్గడంలో కూడా తాటి బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో నిలువైన అధిక నీటిని బయటకు పంపుతుంది. నీటితోపాటు వ్యర్థాలను, విషాలను కూడా బయటకు నెడుతుంది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? ఇది మీ కోసమే

మొబైల్ ఛార్జ్ చేసి ఛార్జర్ ను అలాగే వదిలేస్తున్నారా