మొబైల్ ఛార్జ్ చేసి ఛార్జర్ ను అలాగే వదిలేస్తున్నారా
మొబైల్ ఫోన్ లేదా మరి ఏదైనా పరికరాన్ని పూర్తిగా చార్జ్ చేసిన తర్వాత చాలామంది చార్జర్ను అవుట్ లెట్ లో ప్లగ్ చేసి వదిలేస్తారు. ఇది అనవసరంగా కరెంట్ వాడకం పెంచడం నుంచి అగ్ని ప్రమాదాల వరకు అనేక ప్రమాదాలకు కారణం అవుతుంది. చార్జర్ను ప్లగ్ ఇన్ చేసి ఉంచడం వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
నేటి డిజిటల్ యుగంలో ఫోన్ చార్జర్లు ఇంట్లో ఎప్పుడూ ప్లగ్ లో ఉండడం సర్వసాధారణం. అయితే ఫోన్ చార్జ్ అవ్వనప్పుడు కూడా చార్జర్ను ప్లగ్ లో ఉంచడం వల్ల అనేక ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చార్జర్ ఫోన్ కు కనెక్ట్ కాకపోయినా అది నిరంతరం విద్యుత్ ను గ్రహిస్తుంది. ఇది చార్జర్ను వేడెక్కించితుంది. ముఖ్యంగా చౌకైన లేదా పాత చార్జర్లలో స్పార్క్ లు కరిగిపోవడం లేదా మంటలు సంభవించే ప్రమాదం ఉంది. చార్జర్ ఉపయోగంలో లేనప్పుడు కూడా తక్కువ మొత్తంలో విద్యుత్ ను వినియోగిస్తుంది. ఈ హృదయ ఒక్క రోజులో చిన్నదిగా అనిపించినా నెలలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఘననీయంగా పెరుగుతుంది. ఫలితంగా విద్యుత్ బిల్లు మరియు పర్యావరణ హాని పెరుగుతాయి. నిరంతరం విద్యుత్ సరఫరా చార్జిలోని అంతర్గత భాగాలను త్వరగా క్షీణింప చేస్తుంది. దీనివల్ల చార్జర్ సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు లేదా పూర్తిగా పాడైపోవచ్చు. తరుచు కొత్త చార్జర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. మెరుపు దాడి వంటి అకస్మాత్తు విద్యుత్ షాక్ ల సమయంలో ప్లగ్ లో ఉన్న చార్జర్ దెబ్బతినే అవకాశం ఉంది. చార్జర్ లో అంతర్గత లోపాలు తలెత్తితే షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇంట్లో అగ్నిప్రమాదం లేదా విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చార్జర్ ను ఉపయోగించినప్పుడు ప్లగ్ నుండి తొలగించడం ద్వారా మీరు విద్యుత్ ఆదా చేయడమే కాదు చార్జర్ జీవితకాలాన్ని పొడిగించవచ్చు మరియు మీ ఇంటి అగ్ని విద్యుత్ ప్రమాదాల నుండి సురక్షితంగా ఉంచుకోవచ్చు. అధిక నాణ్యత గల చార్జర్లను ఉపయోగించడం స్మార్ట్ ప్లగ్ లేదా పవర్ స్ట్రిప్ లను వినియోగించడం కూడా సురక్షితమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ హనుమాన్ ఆలయంలో ముస్లింలే పూజారులు
ఆ ఇంటిలో అర్ధరాత్రి అరుపులు… చాటుగా చూసినవాళ్లు షాక్
బ్యాంకింగ్‌లో కొత్త టెక్నాలజీ ఫేస్ పే గురించి తెలుసా
తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో.. గుండెల్ని పిండేసే స్టోరీ
క్రేజీ అప్‌డేట్! బుర్జ్ ఖలీఫాపై.. పవన్ కల్యాణ్ “హరిహర” ట్రైలర్ రిలీజ్

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
