Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హనుమాన్‌ ఆలయంలో ముస్లింలే పూజారులు

ఆ హనుమాన్‌ ఆలయంలో ముస్లింలే పూజారులు

Phani CH

|

Updated on: May 20, 2025 | 2:56 PM

ఊరికో రామాలయం, ఊరికి ఎంట్రన్స్ లో హనుమంతుడి మందిరం మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే హనుమాన్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఆలయంలో ఆంజనేయుడికి హిందువులు పూజలు చేయరు. ముస్లింలు చేస్తారు. ఇదే అక్కడి స్పెషల్. కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయానికి రోజువారీ పూజల బాధ్యతను ముస్లింలే తీసుకుంటున్నారు.

అలాంటి ప్రత్యేకమైన ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం. భారతదేశం ఎన్నో వైవిధ్యాలకు నిలయం. ఇక్కడ అన్ని మతాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మతసామరస్యం వెల్లివిరుస్తుంటుంది. ఒకరి మతానికి చెందిన పండగల్లో మరో మతం వారు పాల్గొంటూ భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ఉంటారు. ఏ మతమైనా భగవంతుని మీద విశ్వాసమే గొప్పదని చాటి చెబుతాయి. అలాంటి ఘటనే ఇది. హనుమంతుడిని ముస్లింలు కూడా పూజిస్తారని మీకు తెలుసా? దాదాపు 150 సంవత్సరాలుగా.. ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప గ్రామంలో ఉంది ఈ ఆలయం. లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయంలో ముస్లింలు పూజలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. ఈ ఆలయం పట్ల ప్రజల విశ్వాసం, నమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి. హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు. అయితే ఇక్కడ పూజ చేసేది మాత్రం ముస్లింలే. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని, ఇక్కడికి వచ్చిన వారు కష్టాలను అధిగమించి హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని చెబుతారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఇంటిలో అర్ధరాత్రి అరుపులు… చాటుగా చూసినవాళ్లు షాక్‌

బ్యాంకింగ్‌లో కొత్త టెక్నాలజీ ఫేస్‌ పే గురించి తెలుసా

తండ్రి ప్రేమ అంటే ఇదేనేమో.. గుండెల్ని పిండేసే స్టోరీ

క్రేజీ అప్‌డేట్‌! బుర్జ్ ఖలీఫాపై.. పవన్‌ కల్యాణ్‌ “హరిహర” ట్రైలర్ రిలీజ్‌

AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఎక్కడంటే ??