Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ అప్‌డేట్‌! బుర్జ్ ఖలీఫాపై.. పవన్‌ కల్యాణ్‌ హరిహర'' ట్రైలర్ రిలీజ్‌

క్రేజీ అప్‌డేట్‌! బుర్జ్ ఖలీఫాపై.. పవన్‌ కల్యాణ్‌ “హరిహర” ట్రైలర్ రిలీజ్‌

Phani CH

|

Updated on: May 20, 2025 | 2:30 PM

పవన్ కల్యాణ్‌ హరిహరవీరమల్లు ట్రైలర్​ను కాస్త డిఫరెంట్​గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దుబాయ్ ప్రతిష్ఠాత్మక బుర్జ్ ఖలీఫా బిల్డింగ్​పై ట్రైలర్​ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్ కావడం విశేషం. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌- జ్యోతికృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'హరిహర వీరమల్లు'.

ఈ చిత్రం పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ జానర్​లో రెండు భాగాలుగా రూపొందుతోంది. రీసెంట్​గా మేకర్స్​ తొలి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌- 1 : స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు తెలిపారు. తాజాగా సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్​గా కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం మూవీటీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బీజీగా ఉంది. దీంతో మేకర్స్​ ప్రమోషన్స్​ షురూ చేసే ప్లాన్​లో ఉన్నారు. గ్లోబల్​ లెవెల్​లో సినిమాకు బజ్ తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే భారీ స్థాయిలో ప్రమోషన్స్​ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇన్నేళ్ల టాలీవుడ్ చరిత్రలో ​దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్​పై తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. ప్రచారం సాగుతున్నట్లు హరిహరి వీరమల్లు ట్రైలర్ బుర్జ్ ఖలీఫాపై విడుదల చేస్తే, అక్కడ రిలీజైన తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డ్ సృష్టించనుంది. ఇదివరుకు బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ ‘జవాన్’ సినిమా ట్రైలర్​ను బుర్జ్ ఖలీఫాపై రిలీజ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఎక్కడంటే ??

గాల్లో విమానం.. పైలట్‌ లేకుండా ప్రయాణం..

మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా

వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..