మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా
అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం కొందరు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగితే మరికొందరేమో ఇంట్లోనే రకరకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే క్రీములు ఆశించిన ఫలితాలను ఇవ్వవు సరికదా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆయుర్వేద మూలికలతో చేసి స్క్రబ్ లను ఉపయోగిస్తే చర్మ కాంతిని పెంచడానికి చక్కగా ఉపయోగపడతాయి.
ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి మార్కెట్లో దొరికే క్రీములకు బదులు సున్నిపిండిని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇందుకు సున్నిపిండి ఒక ఎక్స్ఫోలియంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంపై పొరను శుభ్రపరుస్తుంది. ఇది మృత కణాలను మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. సున్నిపిండి చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. దీనిలో పసుపు, కుంకుమపువ్వు, శనగపిండి వంటి సహజ పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. సున్నిపిండి చర్మ రంధ్రాల నుండి మురికి అదనపు నూనె ఇతర కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ముఖ్యములు ఇతర చర్మ సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. సున్నిపిండిలో పాలు పెరుగు తేనె వంటి సహజ పదార్థాలు చర్మానికి లోతైన తేమను అందించడంలో సహాయపడతాయి. సున్నిపిండిలోని మూలికా పదార్థాలు చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

