గాల్లో విమానం.. పైలట్ లేకుండా ప్రయాణం..
గాల్లో విమానం.. 200 మందికి పైగా ప్రయాణికులు.. కానీ పైలట్ లేడు.. పరిస్థితి తలుచుకుంటేనే గుండె జారినంత పనైంది కదా.. స్పెయిన్ కు వెళ్తున్న ఓ విమానంలో ఇలాగే జరిగింది. ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారంతా కొన్ని నిమిషాలపాటు వణికిపోయారు. తర్వాత ఏం జరిగిందీ.. ప్రయాణికులు ఎలా బయటపడ్డారన్నదీ.. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన గురించి జర్మనీ వార్తా సంస్థ డీపీఏ తాజాగా తెలిపింది.
గత ఏడాది స్పెయిన్ కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానం కో పైలట్ స్పృహ తప్పి పడిపోయినా విమానం 10 నిమిషాల పాటు స్థిరంగా ప్రయాణించిందని డీపీఏ తెలిపింది. 2024 ఫిబ్రవరి 17న ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్లెకు ఎయిర్‌బస్ ఏ321 విమానం బయలుదేరింది. ఫ్టైట్ కెప్టెన్ రెస్ట్ రూమ్‌కు వెళ్లిన సమయంలో కాక్‌పిట్‌లో ఒక్కడే ఉన్న కో పైలట్ స్పృహ తప్పి పడిపోయాడు. స్పానిష్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సీఐఏఐఏసీ నివేదికను ఉదహరిస్తూ డీపీఏ వివరించింది. 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం పైలట్ లేకుండానే 10 నిమిషాల పాటు ఎగిరింది. కో-పైలట్ అపస్మారక స్థితిలోకి వెళ్లినప్పటికీ ఆటోపైలట్ కారణంగా విమానం కుదుపులు లేకుండా స్థిరంగా గాల్లో ఎగరగలిగింది. ఈ సమయంలో కాక్ పిట్ వాయిస్ రికార్డర్ వింత శబ్దాలను రికార్డ్ చేసింది. అవి కో పైలట్ తీవ్రమైన ఆరోగ్య పరిస్థితిని సూచించాయని డీపీఏ తెలిపింది. రెస్ట్ రూం నుంచి వచ్చి కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ఫ్లైట్ కెప్టెన్ రెగ్యులర్ డోర్ ఓపెనింగ్ కోడ్ ఎంటర్ చేసాడు. కాక్ పిట్ లో బజర్ మోగి కో-పైలట్ డోర్ తెరవాలి కానీ కో పైలట్ నుంచి స్పందన లేదు. ఇలా అయిదు సార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆన్‌బోర్డ్ టెలిఫోన్ ద్వారా కో పైలట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేదు.
దీంతో చేసేదేమీ లేక కెప్టెన్ చివరికి ఎమర్జెన్సీ కోడ్ టైప్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా
వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
