AI ఆస్పత్రి.. రోబోలే డాక్టర్లు, నర్సులు.. ఎక్కడంటే ??
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.. తాజాగా వైద్య రంగంలో అద్భుతాలను సృష్టించబోతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆస్పత్రిని సౌదీ అరేబియాలో ప్రారంభించారు. చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
ఈ ఆస్పత్రిలో డాక్టర్‌గా హుఆ అనే ఏఐ ఆధారిత వైద్యుడు, నర్సులుగా ఏఐ రోబోలు సేవలందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలోనే ఒక అద్బుతం. ఇక ఈ ఆస్పత్రిలో ఉబ్బసం, గొంతునొప్పి వంటి 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు. రాన్రాను 50 వరకు వ్యాధులకు చికిత్స అందించేలా డిజైన్ చేయనున్నట్లు Synyi AI CEO Zhang Shaodian తెలిపారు. ఈ క్లినిక్‌కు వచ్చిన రోగులు తమ లక్షణాలను ఓ కంప్యూటర్ ట్యాబ్లెట్ ద్వారా వివరిస్తారు. తిరిగి రోగులను మరిన్ని ప్రశ్నలు అడుగుతుంది ఏఐ డాక్టర్. అనంతరం వాటిని విశ్లేషించి చికిత్స సూచనలు అందిస్తుంది. ఏ మందులు వేసుకోవాలో రాసిస్తుంది. ఈ విధానం రోగులకు కచ్చితమైన వైద్య సేవలను అందించడంలో సహాయపడుతుంది. ఇక ఏఐ కూడా పరిష్కరించలేని అత్యవసర కేసులను చూసేందుకు నిజమైన వైద్యులు కూడా ఈ క్లినిక్‌లో అందుబాటులో ఉంటారు. ఇది భవిష్యత్తులో వైద్య సేవల అందుబాటును పెంచడంలో, వైద్యులపై భారం తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషించనుంది. ప్రస్తుతం పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ క్లినిక్ ప్రారంభమైంది. దీని డేటా ఆధారంగా రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ల సేవలు విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రయల్‌కు ముందు నిర్వహించిన పరీక్షా దశలో, ఈ సాంకేతికతలో తప్పుల శాతం కేవలం 0.3 శాతంగా ఉందని సిన్యి ఏఐ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాల్లో విమానం.. పైలట్ లేకుండా ప్రయాణం..
మీ చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండి ఇలా
వామ్మో.. పెద్దపులి వచ్చింది.. శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
