రాజ్ భుజంపై వాలిన సమంత… శ్యామాలి ఏమందంటే వీడియో
సమంత, దర్శకుడు రాజ్ నిడిమూరు ప్రేమలో ఉన్నారనే వార్త నెట్టింట మారుమోగతోంది. తాజాగా రాజ్ భుజంపై వాలిన ఫోటోను సమంత షేర్ చేయడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటో షేర్ చేసిందని కామెంట్స్ చేశారు. ఈ విషయంపై రాజ్ సతీమణి శ్యామలి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. దర్శకుడు రాజ్ నిడిమూరు, హీరోయిన్ సమంత ప్రేమలో ఉన్నారనే వార్త గత కొంతకాలంగా నెట్టింట మారుమోగతోంది. ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టు షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వచ్చాయి.
తాజాగా సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఆమె నిర్మించిన తొలి సినిమా శుభం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో రాజ్ భుజంపై వాలిన సమంత ఫోటోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈ విషయాన్ని చెప్పడానికే సమంత ఆ ఫోటోను షేర్ చేసిందని కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ సతీమణి శ్యామలిదే తాజాగా ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. నా గురించి మాట్లాడే వారికి, నా తరపున మాట్లాడే వారికి, నేను చెప్పేది వినే వారికి, నా గురించి వార్తలు వినే వారికి, నా గురించి రాసే వారికి, నా కోసం ఆలోచించే వారందరికీ దేవుడి ఆశీర్వాదం ప్రేమ ఉండాలని కోరుకుంటున్న అనే పోస్టును ఆమె షేర్ చేశారు. ఆమె ఉన్నట్టుండి ఇలాంటి మెసేజ్ ఎందుకు షేర్ చేశారా అని నెట్టింట చర్చించుకుంటున్నారు. తన భర్త రాజ్, నటి సమంత గురించి వార్తలు వస్తున్నవేళ ఆమె ఈ పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. శ్యామలి విషయానికి వస్తే సైకాలజీ చదువుకున్న ఆమె బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఒంప్రకాశ్ మిశ్రా, విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్ దర్శకురాలిగా పనిచేశారు.
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో

దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు

ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.

ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది

మీ ఇంటిలోకి పాములు వస్తాయని భయపడుతున్నారా? ఈ మొక్కలు నాటి చూడండి!

అద్దెకు పెళ్లి కుమార్తె.. ఇదో వింత మోసం..వీడియో

మేకప్ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్..పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్..

'పెళ్లి ఓ టైం వేస్ట్!' నాగరికతకు దూరంగా గుహలో నివాసం..
