క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
స్టార్ హీరో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ చేయని పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తుంది. భారతీయ సినీమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా రూపొందిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. దీన్ని ఆయన తనయుడు కార్తికేయ వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని అన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
భారతీయ సినీమా గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినీమా దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అందులో ఎన్టీఆర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాలీవుడ్ మీడియా తెలిపింది. స్క్రిప్ట్ విని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారని ఈ కథ భారతీయ సినీమా పుట్టుక అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనుందని ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని టీం మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపిస్తారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లైన్ అప్ లో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అలాగే వార్ 2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ దీని తర్వాత దేవర 2 ఉంది. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీటి వరుసన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కూడా చేరింది.

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు

కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
