Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో

పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో

Samatha J

|

Updated on: May 18, 2025 | 1:16 PM

చర్మ పిగ్మెంటేషన్ వీటినే మంగు మచ్చలు అని కూడా అంటారు. అతినీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల సూర్యరక్షణ మచ్చలు లేదా హైపర్ పిగ్మెంటేషన్ సంభవిస్తుంది. గర్భం, గర్భ నిరోధక మాత్రలు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల మొలాస్మా అనే మచ్చలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా మహిళల్లో సాధారణం. ముటిమలు, గాయాలు లేదా చర్మ వ్యాధుల తర్వాత మిగిలే గుర్తులు కూడా పిగ్మెంటేషన్ కు దారితీస్తాయి. అదనంగా వృద్ధాప్యం, ఒత్తిడి, ఆహారంలో విటమిన్ లోపాలు కూడా చర్మ రంగును అసమానంగా మార్చవచ్చు. ఈ కారణాలను అర్థం చేసుకోవడం వల్ల సరైన చికిత్సను ఎంచుకోవడం సులభమవుతుంది. ఈ పిగ్మెంటేషన్ సమస్యను కొన్ని సహజ రెమెడీస్ తో నివారించవచ్చు. ఇందులో ముఖ్యమైనది నిమ్మరసం.

చర్మంపై మచ్చలను తొలగించడంలో సహజమైన బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసి రెండు మూడు నిమిషాలు సున్నితంగా స్క్రబ్ చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ ముదురు గుర్తులను తేలిక పరుస్తుంది. పంచదార చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా పరీక్షించి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం చికాకు కలిగించవచ్చు. కలబంద చర్మాన్ని శాంతపరచడంతో పాటు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్లో ఒక విటమిన్ ఈ కాప్సుల్ ను కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి 10 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. కలబందలోని అలోయిన్ మెలనీన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మరియు విటమిన్ ఈ చర్మాన్ని పోషిస్తుంది. ఇది రాత్రి సమయంలో రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బ్రైట్ గా అండ్ సాఫ్ట్ గా కనిపిస్తుంది. పసుపు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ రక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ మచ్చలను తగ్గిస్తుంది.