Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??

Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??

Phani CH

|

Updated on: May 19, 2025 | 3:03 PM

మండే వేసవి లో.... తాటి ముంజలు కూల్ చేస్తున్నాయి. సహజసిద్ధంగా లభించే.. ఈ తాటి ముంజలను తినడానికి జనం ఎంతో ఆసక్తి చూపుతారు.. కేవలం.. 40 రోజుల్లో మాత్రమే ఇవి లభిస్తున్నాయి.. తాటి చెట్లు ఉన్న ప్రాంతంలోనే.. ముంజలు అమ్ముతారు.. ఇప్పుడు.. చాలా మంది తాటి ముంజలు కొనుగోలు చేస్తున్నారు.. ఈ ముంజలు తింటే.. ఆరోగ్యం కూడా బాగుంటుందని నమ్మకం.

దీంతో.. ఈ వేసవి లో చాలా మంది ఈ ముంజలను తిని ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాటి వనం ఎక్కువగానే ఉంటుంది.. ఇప్పటికీ చాలా మంది గీత కార్మికులు.. తాటి చెట్లను ఎక్కి కల్లు గీస్తారు.. వేసవి లో.. 40 రోజుల పాటు తాటి ముంజలు వస్తాయి.. ఈ ముంజలు చల్లదనంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.. ఈ ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.. ఇ తింటే.. శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది.. ఇవి ఎక్కడ పడుతే.. అక్కడ లభించవు.. ఎక్కువగా తాటి చెట్లు ఉన్న ప్రాంతాల్లోనే లభిస్తాయి.. అందరూ గీత కార్మికులు కూడా వీటిని కోయరు.. కల్లుకు పనికి రాని.. ముంజలు మాత్రమే తీస్తారు.. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో.. అధికంగా మంజలు తిస్తున్నారు. కొండగట్టు.. పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముంజలను అమ్ముతున్నారు. ఎటూ చూసిన సందడి కనబడుతుంది.. ఉదయం 9 గంటల నుంచీ సాయంత్రం ఐదు గంటల వరకు.. వీటిని అమ్ముతున్నారు.. డజన్ ముంజకాయలను.. 100 రూపాయాలకు అమ్ముతున్నారు. కొండగట్టుకు వచ్చే భక్తులతో పాటు.. ఇతర ప్రయాణీకులు, స్థానికులు కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది.. ఇక్కడికి.. ముంజలే కోసం వస్తున్నారు.. దీంతో.. ఇక్కడ తిని.. మళ్లీ ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడున్న పండ్లలో.. ఎలాంటి కెమి.కల్స్ లేకుండా.. ముంజలే లభిస్తాయి.. తాటి చెట్లకు ఇప్పటి వరకు ఎలాంటి కెమి కల్స్ వాడటం లేదు.. సహజసిద్ధంగానే.. ఈ ముంజలు ఉంటాయి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడంతో.. ప్రతి ఒక్కరు తినవచ్చు.. స్వీట్ తక్కువగా ఉండటంతో.. షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు.. ముంజలు తింటే.. వడ దెబ్బ నుంచీ బయట పడే వచ్చు.. అలిసిపోయే అవకాశం ఉండదు.. మి గతా ప్రాంతాల్లో కూడా మంజులు లభిస్తున్నాయి.. ఇవి తింటే.. ఎండకాలంలో కూల్.. కూల్ గా ఉండవచ్చు.. ధర ఎక్కువగా ఉన్నా.. వీ టిని తినడానికి ఆసక్తి చూపుతున్నారు.. ఒక్క ముంజ తింటే.. అర లీటర్ నీళ్లతో సమానం.. ముఖ్యంగా చిన్నారులు.. వీటిని ఎక్కువగా తింటున్నారు.. ఎండకాలంలో కాస్తా రిలీఫ్ కావాలంటే.. ముంజలు తినాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటర్‌ కోసం ఫ్రిజ్‌ ఓపెన్ చేసిన మహిళ.. లోపల సీన్ చూసి గుండె గుబేల్‌..

ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

ఇండియన్ హీరోయిన్‌ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్

అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా..

ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..

Published on: May 19, 2025 08:50 AM