అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా..
ఇంతకు ముందు శివుని గెటప్ లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఈ బ్యూటీకి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. అందుకే కూచిపుడి, భరత నాట్యం వంటి క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. పలు నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెల్చుకుంది. అంతేకాదు ఏడేళ్ల వయసులోనే మంగళం పల్లి బాలమురళీ కృష్ణ వంటి దిగ్గజాల చేతుల మీదుగా అవార్డులు అందుకుంది.
ఇదే క్రమంలో పలు టీవీ రియాలిటీ షోల్లోనూ సత్తా చాటింది. అలాగే పలు కల్చరల్ ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. ఇదే క్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్తీక దీపోత్సవంలోనూ సందడి చేసింది. అందులో శివుడి వేషధారణలో కనిపించి ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. తన డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇదే క్రమంలో షార్ట్ ఫిల్మ్స్ లో, ఆ తర్వాత సినిమాల్లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల్లో నటించింది. ఈ శుక్రవారం రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోన్న ఓ మూవీలోనూ ఈ బ్యూటీనే హీరోయిన్ గా చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరు తెగ మార్మోగిపోతోంది. ఇంతకీ ఆమె ఎవరునుకుంటున్నారా? సారంగపాణి జాతకం సినిమా హీరోయిన్ రూపా కొడువాయూర్. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ సొగసరికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రూప కొడువాయూర్ పేరు చూస్తే ఏదో మలయాళీ అమ్మాయిలా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఆమె సొంతూరు. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైందీ అందాల తార.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..
Nani: ఆ హీరోయిన్ అంటే నానీకి చాలా ఇష్టమట..
చేసిందే దొంగ పని.. మళ్లీ అందులో న్యాయమా తల్లి
Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??

పెళ్లి అనుకుంటున్నారా.. స్టంట్స్ షో అనుకుంటున్నారా..

నెల్లూరు జిల్లాలో అద్భుతం - శివలింగాన్ని చుట్టేసిన నాగుపాము

ఆ వ్యక్తికి నిలువెల్లా విషం.. అతని రక్తం నుంచే యాంటీ వీనమ్ తయారీ

యజమానిపై ప్రేమతో.. ఏనుగులు ఏం చేస్తున్నాయో చూడండి.. వీడియో

పులిని మింగబోయిన అనకొండ... ఆఖరికి అంతా షాక్ వీడియో

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్‌కు బలైన ఇంజనీర్.. వికటించిన ఇంజెక్షన్..

దానిమ్మ పండ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే వీడియో
