Nani: ఆ హీరోయిన్ అంటే నానీకి చాలా ఇష్టమట..
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈసినిమాలో న్యాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో నాని రఫ్పాడించనున్నారు.
దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు నాని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని హిట్ 3 సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పారు. ఈ నేచురల్ స్టార్‌కి అతిలోక సుందరి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. ఆమెను ఆరాధించానని చెప్పారు నాని. కేవలం శ్రీదేవికోసం క్షణ క్షణం సినిమా లెక్కలేనన్నిసార్లు చూసానని చెప్పారు. అంతేకాదు, ఆ సినిమా లక్షలసార్లు చూడాల్సిన సినిమా అన్నారు. శ్రీదేవి ఆ సినిమాకే అందాన్ని తెచ్చారని, అసలు ఆమె అంత అందంగా ఎలా ఉన్నారో తనకు ఇప్పటికీ అర్థం కాదన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ‘హిట్ 3’, అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్ 2’ ఒకే రోజు విడుదలవుతున్నాయి కదా.. పోటీ తప్పదా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘‘రైడ్ 2’కు ప్రాధాన్యమివ్వండి. అజయ్ సర్‌తో నాకు పోటీ లేదు. మీకు వీలుంటే ‘హిట్ 3’ని థియేటర్‌లో చూడండి’’ అని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేసిందే దొంగ పని.. మళ్లీ అందులో న్యాయమా తల్లి
Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
44 ఏళ్లుగా పూరి గుడిసెలో గుట్టలా పెరిగిన పాముల పుట్ట వీడియో

