AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..

ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..

Phani CH

|

Updated on: Apr 30, 2025 | 5:16 PM

టాలీవుడ్ క్యూట్ కపుల్స్లో రామ్ చరణ్- ఉపాసన జోడీ ఒకటి. ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా.. పెళ్లై 13 ఏళ్లు కావస్తున్నా ఈ జంట మధ్య ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న చెర్రీ - ఉపాసనలది లవ్ మ్యారేజ్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇంతకీ వీరిద్దరూ మొదటిసారి ఎక్కడ కలిశారు..? పెద్దలను ఎలా ఒప్పించారు.? మెగా వారసుడిగా తెరంగేట్రం చేసినా తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు రామ్ చరణ్.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ గ్లోబల్ స్టార్ అటు సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో, ఇటు ఫ్యామిలీకి సైతం అంతే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఏ మాత్రం టైం దొరికినా భార్య ఉపాసనతో ఫారిన్ టూర్ లకు చెక్కేస్తుంటారు. పెళ్లై పదేళ్లు దాటినా.. ఓ పాప పుట్టినా.. ఈ జోడీ మాత్రం ఇప్పటికీ కొత్త జంటలా కనిపిస్తుంది. 2012 జూన్ 14న రామ్ చరణ్ – ఉపాసనల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అంతా అనుకుంటారు. కానీ వారిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. రామ్ చరణ్, ఉపాసన పరిచయం ఓ కాఫీ షాప్ లో మొదలైందట. కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన ఉపాసన చెర్రీలు మొదట్లో టామ్ అండ్ జెర్రీల్లా ఉండేవారట. సిల్లీ రీజన్స్ తో చీటికిమాటికి గొడవలు పడేవారట. అలా మొదలైన వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఉపాసన క్యారెక్టర్ కు చెర్రీ ఫిదా అయిపోయాడట. అయితే ఆమెపై తనకున్నది ప్రేమ అనే విషయం తెలిసేందుకు రాం చరణ్ కు ఐదేళ్లు పట్టిందట. 2010లో ఆరెంజ్ మూవీ రిలీజైన తర్వాత వారిద్దరి బంధం మరింత బలపడింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రేమ అనే కాన్సెప్ట్ వేస్ట్ అని ఎవరినీ ప్రేమించవద్దని ఉపాసనకు చెప్పిన రామ్ చరణ్ చివరకు ఆమెతోనే పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. తనే ఫస్ట్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇరువురి ఇళ్లలో విషయం చెప్పి ఒప్పించారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని ఆ ప్రేమపక్షుల్ని పెళ్లి పీటలు ఎక్కించారు. పెళ్లైన 11ఏళ్ల తర్వాత వారికి క్లీంకార పుట్టింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nani: ఆ హీరోయిన్‌ అంటే నానీకి చాలా ఇష్టమట..

చేసిందే దొంగ పని.. మళ్లీ అందులో న్యాయమా తల్లి

Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??