ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
వేసవి కాలం ముగింపు దశకు వచ్చే సరికి నేరేడు పండ్లు మనకు లభిస్తాయి. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలో నేరేడు పండ్లు, వాటి విత్తనాలను ఉపయోగిస్తారు. నేరేడు పండ్లను రోజూ ఒక కప్పు తినాలి. లేదా ఈ పండ్లకు చెందిన విత్తనాలను పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో నీటిలో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజానికి 30 నిమిషాల ముందు తాగాలి.
ఇలా చేస్తున్నా కూడా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. నేరేడు పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. నేరేడు పండ్లలో ఉన్న విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ నియంత్రణలో ఉంటుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో పాలిఫినాల్స్ ఇంకా ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం తగ్గుతుంది. శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గుతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇండియన్ హీరోయిన్‌ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్
అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా..
ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

