Telangana: ఉపాధి హామీ పనుల్లో తవ్వుతుండగా మెరుస్తూ కనిపించింది.. వెలికితీసి చూడగా
ఉపాధి హామీ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిపిన కూలీలకు.. మట్టిలో ఏదో గట్టిగా తగిలింది. గడ్డపారతో దాని చుట్టూ ఉన్న మట్టిని వెలికితీశారు. బయటపడింది చూసి అందరూ షాక్ అయ్యారు. కళ్లు జిగేల్ మనిపించేలా.. మధ్యయుగానికి చెందిన ఓ విగ్రహన్ని తవ్వి తీశారు.
జనగామ జిల్లా ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. శామీర్‌పేట్ గ్రామ శివారులో మధ్యయుగం కాలం నాటి విగ్రహం ఒకటి బయటపడింది. బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఈ విగ్రహం బయటపడట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. శామీర్‌పేట్ గ్రామ శివారులో ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. మట్టిలో ఒక్కసారిగా మెరుస్తూ పురాతన విగ్రహం ఒకటి కనిపించింది. దానిని వెలికితీసి ఆశ్చర్యపోయారు. అదొక మధ్యయుగం నాటి ఓ దేవత విగ్రహంలా ఉంది. స్థానికంగా ఉన్న చరిత్ర పరిశోధకులకు చూపించగా.. అది మధ్యయుగం కాలంనాటి విగ్రహం అయ్యి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా, పురాతన విగ్రహం లభ్యం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు తరలివచ్చారు.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

