భర్తను పిచ్చకొట్టుడు కొట్టిన భార్య.. లబోదిబోమంటూ.. వీడియో వైరల్
భార్యచేతిలో చావుదెబ్బలు తిని పోలీసులను ఆశ్రయించాడో వ్యక్తి. భార్యనుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. తనను భార్య కొడుతున్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియో క్లిప్‌ను ఈ సందర్భంగా పోలీసులకు అందజేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ పన్నాలో జరిగింది. భార్య బాధిత భర్త తాలూకు వీడియో క్లిప్ బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాలు ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన లోకేష్ అనే వ్యక్తి 2023లో హర్షిత రైక్వార్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి అతని భార్య, అత్త, బావమరిది తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. డబ్బు, నగలు కావాలని తనను కొడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మార్చి 20న మరోసారి డబ్బు కావాలని అడగడంతో తాను ఇవ్వలేని చెప్పానని, దాంతో భార్య తనని దారుణంగా కొట్టిందని, కొట్టొద్దని చేతులు జోడించి వేడుకున్నా కనికరిచంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టిందని వాపోయాడు. బాధలు భరించలేక ఆధారం కోసం ఎవరూ లేని సమయంలో ఇంట్లో కెమెరాను ఏర్పాటుచేసుకున్నానని వివరించాడు. సత్నా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు భార్య తనను కొడుతున్న వీడియోను పోలీసులకు అందజేశాడు. భార్యనుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. లోకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ వస్తువులను ముట్టుకున్నారా? వెంటనే చేతులు కడుక్కోండి.. లేదంటే..
చొక్కాలు విప్పి.. ‘ఎక్స్‌ప్రెస్ వే’ పై ఓవరాక్షన్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల నమ్మలేని ప్రయోజనాలివే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

