వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేసిన మహిళ.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..
ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్. అందుకే ఎక్కడ చూసినా అవి సయ్యాటలు ఆడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయ్. సమ్మర్ సీజన్ కావడంతో వేడి తాపానికి తట్టుకోలేక జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ప్రమాదంలో పడాల్సి వస్తుంది. చల్లదనం కోసం పాములు వాహనాల్లో, ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ తిష్టవేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఎలా చేరిందో ఏమో కానీ ఓ పాము ఏకంగా ఫ్రిజ్ లోపల తిష్ట వేసింది. డోర్ తీయగానే పడగ విప్పి బుస్సుమంది. అది చూసిన మహిళ గుండె ఆగినంత పనైంది. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన ఓ మహిళ ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగాలని ఆరాటపడింది. నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. వెంటనే అందులో ఉన్న ఓ పాము బుస్సుమంటూ పడగవిప్పింది. దెబ్బకు షాకైన మహిళ వెంటనే వెనక్కి జరిగింది. ఫ్రిజ్‌లో తిష్టవేసిన ఆ పామును వీడియో తీసింది. అయితే పాము ఫ్రిజ్‌లోకి ఎలా వెళ్లింది అనే దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు ఓ రేంజ్లో షేర్లు, కామెంట్స్ వస్తున్నాయి. ‘వామ్మో, ఇకపై ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని’ ఓ నెటిజన్లు అంటున్నారు. బయట వేడిగా ఉంది. కాస్త చల్లదనం కోసం ఫ్రిజ్‌లోకి వెళ్లింది అందులో తప్పేముంది అంటూ మరో యూజర్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. అయితే ఈ వీడియోను పామును ఫ్రిజ్ లోపల ఉంచి.. కావాలని వీడియో తీశారని మరికొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఇండియన్ హీరోయిన్ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్
అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా..
ఐదేళ్ల ప్రేమ.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే..
Nani: ఆ హీరోయిన్ అంటే నానీకి చాలా ఇష్టమట..
అటు భర్త.. ఇటు లవర్.. ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ..
యజమాని కోసం.. ఎనిమిదేళ్లుగా ఆసుపత్రిలోనే తిరుగుతున్న కోడిపుంజు!
భారత్‌లో ఈ 9 నగరాలు టాప్!
కుక్కను చూసి చిరుత పరుగో.. పరుగు.. ఏం జరిగిందో మీరే చూడండి!
కోతుల బెడదకు చెక్.. బామ్మగారి ఐడియా అదిరిందిగా!
అత్తారింటికి దారేది? అయ్యో.. ఈ నవ వధువుకి ఎంత కష్టం వచ్చింది!
పెట్రోలును మంచినీళ్లలా తాగేసిన యువకుడు!

