AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

Ashok Bheemanapalli

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 12, 2025 | 10:23 PM

రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫారమ్‌ మీదనుంచి మరో ప్లాట్‌ఫారం మీదకు వెళ్లడానికి ప్రయాణికులు మెట్లు ఎక్కి వెళ్లలేక పట్టాలు దాటుకుంటూ వెళ్తారు. అది చాలా ప్రమాదమని, అలాచేయొద్దని రైల్వే అధికారులు ఎంత చెప్పినా చాలామంది పట్టించుకోరు. అలా పట్టాలు దాటుతూ ఒక్కోసారి ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూశాం.

రైల్వే స్టేషన్లలో పరిస్థితి ఇలా ఉంటే.. రైల్వే గేట్ల దగ్గర పరిస్థితి మరోలా ఉంటుంది. రైలు వస్తుందని గేటు వేసినా వాహనదారులు గేటుకిందనుంచి దూరి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అసలు రైల్వే గేటే లేనిచోట పరిస్థితి ఇంక చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో లోకోపైలట్‌ పరిస్థితి వర్ణనాతీతంగా వుంటుంది. రైలునడపడమే కాదు.. గేట్‌మ్యాన్‌గా కూడా విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఈ వీడియో ప్రకారం రైల్వే గేటు ఏర్పాటు చేయని ఓ ప్రాంతంలో వాహనదారులు తమకు ఇష్టమొచ్చినట్లు అడ్డదిడ్డంగా రైలు పట్టాలు దాటుతుంటారు. యూనిఫామ్‌లో ఉన్న ఓ వ్యక్తి అక్కడే నిలబడి దగ్గరుండి వాహనాలను రోడ్డు దాటిస్తుంటాడు. కాసేపటి తర్వాత వాహనాలను స్టాప్ చేసిన ఆ వ్యక్తి రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్లాడు. దూరంగా ఆగి ఉన్న రైలులోనికి ఎక్కి, ఇంజిన్‌ను స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతకీ అతను లోకోపైలట్‌. ఆ రైలును నడుపుతున్న డ్రైవర్‌. ఎంతకీ వాహనదారులు ఆగకపోవడంతో తానే స్వయంగా ఇలా రైలు దిగి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసిన తర్వాత రైలును ముందుకు పోనిచ్చి తన ప్రయాణం కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. రైల్వే గేటు లేని చాలా చోట్ల లోకో పైలట్ల పరిస్థితి ఇదేనని కొందరు, ఈ లోకోపైలట్‌ ఓపికకు మెచ్చుకోవాల్సిందే అని మరికొందరు కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ భర్తా ఇవ్వని గిఫ్ట్‌ ఇదీ! కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

ఖర్జూరం కల్లుతో ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు..!

పొదల్లో వింత శబ్ధాలు.. ఏమిటా అని పరిశీలించిన స్థానికులకు షాక్‌

అక్కడ భారీగా బంగారం నిల్వలు.. పసిడి ధరలు పడిపోతాయా?

Published on: Apr 12, 2025 12:54 PM